అన్వేషించండి

Maha Mandaleswar: ఐటీ ఉద్యోగాన్ని వదిలి అఖారాలో మహామండలేశ్వరుడిగా దీక్ష చేపట్టిన యూఎస్‌ యువకుడు

Ascetic initiation: సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకుని హిందూవుగా మారిన యూఎస్‌ యువకుడు. ఐటీ ఉద్యోగం వదులుకుని సన్యాసం స్వీకరణ

MAHA KUMBH: సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశ,విదేశాలకు చెందిన చాలా మంది ఇతర మతాలను వీడి హిందూమతం స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. మహాకుంభమేళా వేడుకలను పురస్కరించుకుని  అమెరికా ఆర్మీకి( U.S. Army) చెందిన ఓ కమాండర్ కుమారుడు  ఐటీ( IT) ఉద్యోగం వదిలేసి మరీ అఖారాలోచేరాడు. కాషాయ వస్త్రాలు ధరించి మహామండలేశ్వరునిగా సన్యాస దీక్ష ఆరంభించాడు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని  ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో  జరిగిన మహా కుంభమేళ వేడుకల్లో ఆదివారం ఆధ్యాత్మిక  వేడుకల అనంతరం అమెరికాకు చెందిన టామ్‌(Tom)కు అఖారా పరిషత్‌ అధిపతి మహంత్ రవీంద్ర పూరి(Ravindra Puri) సన్యాస దీక్ష ఇచ్చారు. అతనికి  వ్యాసానంద గిరి అనే పేరు పెట్టి అధికారికంగా మహమండలేశ్వరుడిగా నియమించినట్లు రవీంద్ర పూరితెలిపారు
 
ఆదివారం జరిగిన ఆధ్యాత్మిక వేడుకల అనంతరం టామ్‌కు వ్యాసానంద గిరి (Vyasandha Giri)అనే కొత్త పేరు పెట్టారని, అధికారికంగా మహామండలేశ్వరుడిగా నియమితులయ్యారని అఖారా(Akhara) పరిషత్ అధిపతి మహంత్ రవీంద్ర పూరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 13 మంది సన్యాసం స్వీకరించగా...వారిలో  వ్యాసానంద గిరి ఒకరన్నారు. ఐటీ  ఉద్యోగం చేస్తున్న టామ్‌...ఆధ్యాత్మిక జీవితంపై ఇష్టంతో  అన్నీ వదులుకుని సన్యాసిగా మారాడాని అఖారా పరిషత్ అధిపతి మహంత్ రవీంద్ర పూరి తెలిపారు.ఐటీ ఉద్యోగం చేస్తూనే  ఆధ్మాత్మిక విషయాలపై అవగాహన  పెంచుకున్న టామ్‌.., హిందూమతం గొప్పతనం తెలుసుకుని ముందుగా  హిందూవుగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత  సన్యాసం  స్వీకరించాడు. భారతీయ ప్రాచీన విద్యలు,కళలు, సంస్కృతి, సంప్రదాయాలంటే  టామ్‌కు ఎంతో ఇష్టమని రవీంద్రపూరి  తెలిపారు. అతనికి  యోగా,ధ్యానం చేయడం వచ్చని... హిందూ మతం మరియు సనాతన ధర్మంపై చాలా పరిశోధనలు  చేశాడని వివరించారు. రెండేళ్లుగా  క్రమం తప్పకుండా  రిషికేష్‌కు  వస్తున్న  టామ్‌...వచ్చినప్పుడల్లా  తనని కలిసి వెళ్తుండేవాడన్నారు. మహాకుంభమేళా  పర్వదినాలను పురస్కరించుకుని  ఆధివారం  జరిగిన ఆధ్యాత్మిక  కార్యక్రమాల అనంతరం టామ్‌కు వ్యాసానంద గిరి అనే కొత్తపేరు పెట్టి...అధికారికంగా మహా మండలేశ్వరుడిగా నియమించినట్లు పూరి తెలిపారు. 
 
మహా మండలేశ్వరుడికి ఉండాల్సిన అర్హతలు
అఖారాలో అత్యంత ముఖ్యస్థానమైన మహామండలేశ్వరుడిగా  ఒకరిని నియమించే ముందు ఎన్నో పరీక్షలు నిర్వహిస్తారు.అతను ఆపదవికి తగినవాడు అనుకున్న తర్వాతే నియమిస్తారు. ధ్యానం,యోగాలో ప్రావీణ్యం సంపాదించినవాడు,ఇంద్రియాలను నియంత్రించడం నేర్చుకున్నవారినే ఆ పదవి వరిస్తుందని పూరీ తెలిపారు. హిందూ మతం పూజారిగా, సనాతన ధర్మం పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలన్నారు. అలాంటి లక్షణాలన్నీ టామ్‌లో ఉన్నాయని...అందుకే అతన్ని మహామండేలేశ్వరుడిగా నియమించినట్లు తెలిపారు.
 
ఇంకా చెప్పాలంటే మనకన్నా విదేశీయులే ఎక్కువ నిష్ఠగా హిందూమతాన్ని, ఆచారాలను పాటిస్తున్నారని రవీంద్ర పూరీ అన్నారు. వారు ఒకసారి ధ్యానం చేసేప్పుడు ఆధ్యాత్మికంలో  మునిగిపోతారన్నారు. మనవాళ్లు చాలామంది ధ్యానం చేసేప్పుడు పొరపాటును దోమకాటు వేస్తే ఉలిక్కిపడి లేస్తారని, ధ్యానం చేస్తున్నప్పుడు ఆవలించడం,దగ్గురావడం,నిద్రపోవడం చేస్తారని...కానీ టామ్‌ మాత్రం గంటలపాటు ఏకాగ్రతతో ధ్యానం చేయగలడన్నారు. అతడు చాలా గొప్పవాడవుతాడన్న నమ్మకం ఉందన్నారు. నిరంజనీ అఖరా  ద్వారా ఇప్పటి వరకు 30 మంది మాహ మండలేశ్వరులను తయారు చేసినట్లు  పూరీ తెలిపారు.

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Prabhas Fauji Actress: మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... నేను ఇండియన్ అమెరికన్ - ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... నేను ఇండియన్ అమెరికన్ - ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో తీవ్ర చర్చ- గూగుల్‌, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్
ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో తీవ్ర చర్చ- గూగుల్‌, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Prabhas Fauji Actress: మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... నేను ఇండియన్ అమెరికన్ - ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... నేను ఇండియన్ అమెరికన్ - ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో తీవ్ర చర్చ- గూగుల్‌, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్
ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో తీవ్ర చర్చ- గూగుల్‌, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్
Singer Pravasthi Aradhya: రీల్‌లో మాట్లాడినట్లుగా రియల్‌లో మాట్లాడండి - సింగర్ సునీతకు ప్రవస్తి కౌంటర్
రీల్‌లో మాట్లాడినట్లుగా రియల్‌లో మాట్లాడండి - సింగర్ సునీతకు ప్రవస్తి కౌంటర్
Heat Stroke Deaths in Telangana : తెలంగాణలో పెరుగుతోన్న హీట్ స్ట్రోక్ మరణాలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే, ఎండతో జాగ్రత్త
తెలంగాణలో పెరుగుతోన్న హీట్ స్ట్రోక్ మరణాలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే, ఎండతో జాగ్రత్త
Pravasthi Aradhya Caste: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు
ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు
TG Inter Board: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల, ఫీజు వివరాలు ఇలా
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల, ఫీజు వివరాలు ఇలా
Embed widget