Amarnath Yatra 2022 : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్
ఈసారి అమర్‌నాథ్ యాత్రకు మూడు లక్షల మందికిపైగా భక్తులు రానున్నట్టు బోర్డు అంచనా వేస్తోంది. ఆ మేరకు ఏర్పాటు చేస్తున్నట్టు బోర్డు సీఈవో నితీశ్వర్ తెలిపారు.
2022లో జరిగే అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11న ప్రారంభమవుతుంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు నిలిపివేసిన యాత్ర ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించనున్నారు. జూన్ 30న ప్రారంభం కానున్న యాత్ర ఆగస్టు 11న ముగుస్తుంది.
ఈ విషయాన్ని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు సీఈవో నితీశ్వర్ కుమార్ ఈ వివరాలు వెల్లడించినట్టు ANI పేర్కొంది.
"అమర్‌నాథ్ యాత్ర 2022 జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తుంది. ఏప్రిల్ 11న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. యాత్రికులు పుణ్యక్షేత్రం బోర్డు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు" అని బోర్డు అధికారి తెలిపారు.
నితీశ్వర్ కుమార్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో 3000 మంది యాత్రికులకు వసతి కల్పించే యాత్రి నివాస్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది మూడు లక్షల మంది యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నామని, ఇందుకోసం ఏప్రిల్ 11న వివిధ బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
"యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11న జమ్మూకశ్మీర్ బ్యాంక్, పీఎన్‌బీ బ్యాంక్, ఎస్ బ్యాంక్‌కు చెందిన 446 బ్రాంచ్‌లలో, దేశవ్యాప్తంగా 100 ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది. మూడు లక్షల మందికిపైగా యాత్రికులు వస్తారని ఆశిస్తున్నాం. రాంబన్‌లో యాత్రి నివాస్ ఉంది. 3000 మంది యాత్రికులు కూర్చునేందుకు వీలుగా దీన్ని తయారు చేశాం అని నితీశ్వర్ కుమార్ తెలిపారు.
యాత్రికులకు RFID ఇస్తారు. దీని ద్వారా యాత్రికులను ఈజీగా ట్రాక్ చేయవచ్చు. గుర్రాలపై భక్తులను తీసుకెళ్లే వారికి బీమా కవరేజీ వ్యవధిని ఒక సంవత్సరానికి పెంచారు. యాత్రికుల బీమాను కూడా రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు.
దక్షిణ కాశ్మీర్‌లోని ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి లక్షల మంది సందర్శించుకుంటారు. శివును దర్శించుకుంటారు.