Red Alert to Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన భవనాలు- మరోసారి ఐఎండీ రెడ్ అలర్ట్ - రాత్రి కురిసిన వర్షాలకు 12 మంది మృతి
Red Alert to Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి 12 మంది మృతి చెందారు. ఈక్రమంలోనే మరోసారి హిమాచల్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించించింది.
Red Alert to Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో గత కొంత కాలంగా వవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ ఎత్తున కురుస్తున్న వానలకు పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి 12 మంది మృతి చెందారు. అలాగే 400కు పైగా రహదారులు మూసుకుపోయాయి. మండీ జిల్లా ఐదుగురు, శిమ్లా జిల్లాలో వలస జీవులైన భార్యాభర్తలు చనిపోయారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇళ్లు దెబ్బ తిన్నట్లు అధికారులు బుధవారం రోజు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్ర రాజధాని శిమ్లాతోపాటు ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగ కార్యాలయం రెడ్ అల్ర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఓ ప్రకటనలో కోరారు.
#WATCH | Himachal Pradesh: Hundreds of vehicles stranded in the Kullu district after the Kullu-Mandi road got damaged due to rainfall (23.08) pic.twitter.com/nsmBCHBASl
— ANI (@ANI) August 24, 2023
Kullu, Himachal Pradesh: "There is nothing to eat or drink here. There is a traffic jam of about 5-10 km. The road should be opened soon," say stranded people (23.08) pic.twitter.com/24gX34fUeI
— ANI (@ANI) August 24, 2023
శిమ్లా నగరంలో పలు చోట్ల చెట్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడి, ఇళ్లకు నెర్రెలు వచ్చి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హిమాచల్ పాలిట శాపంగా పరిణమించిన ఈ వర్షాకాలంలో ఇప్పటిదాకా మూడు విడతలుగా కురిసిన కుండపోత వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మత్తం 709 రోడ్లు మూసుకుపోగా.. 238 మంది మృతి చెందారు. 40 మంది ప్రజలు ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. అలాగే గాంధీ మెడికల్ కాలేజీలోకి కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చి చేరాయి.
#WATCH | Himachal Pradesh: Water enters Indira Gandhi Medical College and Hospital in Shimla, following heavy rainfall (23/08) pic.twitter.com/DxeJJA5m43
— ANI (@ANI) August 24, 2023
నెలరోజుల క్రితం కూడా పొంగిపొర్లిన ప్రధాన నదులు
హిమాచల్ ప్రదేశ్ అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. హిమాలయాల్లో ఉన్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. మనాలి వద్ద ఉన్న బియాస్ నది ఉప్పొంగుతోంది. వేగంగా ప్రవహిస్తున్న ఆ నది ధాటికి.. టూరిస్టులకు చెందిన కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి. మనాలిలో బియాస్ నది సమీపంలో పార్క్ చేసిన కార్లన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నీరు, బురద ఒక్కసారిగా కొట్టుకురావడంతో.. కార్లు కూడా ఆ బురద నీటిలోనే మాయం అయ్యాయి. వర్షాలు.. వరదలు.. కొండచరియలు విరిగిపడడం వల్ల.. హిమాచల్‌లో ఇప్పటికే 19 మంది మృతిచెందారు. హిమాచల్ ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో అక్కడ వర్షం కురుస్తోంది. ఆకస్మిక వరదల వల్ల భారీ స్థాయిలో నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో ఇండ్లు కూడా కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయి. పలు చోట్ల క్లౌడ్‌బస్ట్ కావడంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. హిమాచల్‌లో 828 రోడ్లను, మూడు జాతీయ హైవేలను మూసివేశారు.