అన్వేషించండి

బాగా కనిపిస్తుందన్న ఉద్దేశంతోనే వందేభారత్‌కి కాషాయ రంగు, రైల్వే మంత్రి క్లారిటీ

Orange Vande Bharat: విజిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతోనే వందేభారత్‌ ట్రైన్‌లకి కాషాయ రంగు వేసినట్టు రైల్వే మంత్రి వెల్లడించారు.

Orange Vande Bharat:

వందేభారత్‌కి కాషాయ రంగు..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌కి కాషాయ రంగు వేయడాన్ని రాజకీయం చేయొద్దని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చి చెప్పారు. కాషాయ రంగువేయడం వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందా అన్న మీడియా ప్రశ్నలకు ఈ సమాధానమిచ్చారు. కేవలం శాస్త్రీయంగా ఆలోచించి ఈ రంగు వేశామే తప్ప..రాజకీయ ఉద్దేశాలేమీ లేవని స్పష్టం చేశారు. కంటికి బాగా కనిపించే రంగు కావడం వల్లే ఆరెంజ్ కలర్‌ని ఎంపిక చేసినట్టు వివరించారు. కేరళలో సెప్టెంబర్ 24వ తేదీన కసరగడ్ నుంచి తిరువనంతపురం వరకూ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. కాషాయ రంగులో ఉన్న ట్రైన్‌ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఒకేసారి 9 వందేభారత్ ట్రైన్స్‌ని ప్రారంభించారు. అయితే...ఆరెంజ్ కలర్ వేయడంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న వాళ్లూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెట్టారు. పార్టీ రంగునే ట్రైన్‌లకు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే...అశ్వినీ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. 

"వందేభారత్ ట్రైన్స్‌కి కాషాయ రంగు వేయడాన్ని రాజకీయం చేయొద్దు. ఇది 100 సైంటిఫిక్‌గా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. సాధారణంగా మన కళ్లకి పసుపు, కాషాయ రంగుల విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఐరోపాలో దాదాపు 80% రైళ్లకి ఆరెంజ్, ఎల్లో కాంబినేషన్‌ రంగులనే వేస్తారు. ఎల్లో ఆరెంజ్ లాగే సిల్వర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ..విజిబిలిటీలో ఆరెంజ్, ఎల్లోకి మించిన కలర్స్‌ ఏమీ ఉండవు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవు"

- అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే మంత్రి

దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు అశ్వినీ వైష్ణవ్. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, షిప్స్‌లో కీలకంగా భావించే black box లకూ ఆరెంజ్ కలర్ వేస్తారని, అవి చాలా క్లియర్‌గా కనిపిస్తాయన్న కారణంతోనే అలా తయారు చేస్తారని వివరించారు. 

స్లీపర్ వందే భారత్ రైలు మొదటి వెర్షన్ డిజైన్ తుది దశకు చేరుకుంది. కొత్త డిజైన్‌తో వందే భారత్ స్లీపర్ ట్రైన్ తయారీకి రంగం సిద్ధం చేసినట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. దీనిని సంబంధించిన నమోనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 857 బెర్త్‌లతో కూడిన వందే భారత్ స్లీపర్ రైలు మొదటి వెర్షన్ రూపుదిద్దుకోనుంది. 2024 మార్చి నాటికి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నుంచి బయటకు వస్తుంది. ఇందులో ప్రయాణికుల కోసం 823 బెర్త్‌లు, సిబ్బందికి 34 ఉంటాయి. మామూలు రైలులో నాలుగు టాయిలెట్లు ఉంటాయి. అయితే స్లీపర్ వందే భారత్‌లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. అంతేకాదు ఒక మినీ ప్యాంట్రీ ఉంటుంది.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఈ సెమీ లైట్ స్పీడ్ ట్రైన్లలో జర్నీ చేయడం ప్రయాణికులకు సరికొత్త అనునుభూతిని కలిగిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్పీడ్, సేఫ్టీ, సర్వీస్ ఈ రైళ్ల ప్రత్యేకతని తెలిపాయి. వీటికి సంబంధించిన నమూనా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో లోయర్, అప్పర్ బెర్తులు మాత్రమే ఉన్నాయి. మిడిల్ బెర్త్‌లు లేవు. అంతేకాకుండా పై బెర్త్‌ చేరుకోడానికి ఉపయోగించే నిచ్చెన కూడా సరికొత్తగా కనిపిస్తున్నాయి.

Also Read: మోదీ చాలా తెలివైన వ్యక్తి, ఆయన వల్లే భారత్‌ దూసుకుపోతోంది - పుతిన్ ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
Karimnagar Electric Buses: కరీంనగర్‌కూ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయోచ్! ఏ రూట్లలో తిప్పుతారో తెలుసా?
కరీంనగర్‌కూ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయోచ్! ఏ రూట్లలో తిప్పుతారో తెలుసా?
Kolkata: దేశంలో ఇన్ని అత్యాచారాలు జరగడం దారుణం, కఠిన చట్టం చేయండి - మోదీకి మమతా లేఖ
దేశంలో ఇన్ని అత్యాచారాలు జరగడం దారుణం, కఠిన చట్టం చేయండి - మోదీకి మమతా లేఖ
Tirumala News: తిరుమలలో పలు దర్శనాలు రద్దు, కారణాలు ఏంటంటే
తిరుమలలో పలు దర్శనాలు రద్దు, కారణాలు ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
టెక్కలి ఇన్‌చార్జిగా దువ్వాడ అవుట్? శ్రీనును తప్పించే యోచనలో జగన్!
Karimnagar Electric Buses: కరీంనగర్‌కూ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయోచ్! ఏ రూట్లలో తిప్పుతారో తెలుసా?
కరీంనగర్‌కూ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయోచ్! ఏ రూట్లలో తిప్పుతారో తెలుసా?
Kolkata: దేశంలో ఇన్ని అత్యాచారాలు జరగడం దారుణం, కఠిన చట్టం చేయండి - మోదీకి మమతా లేఖ
దేశంలో ఇన్ని అత్యాచారాలు జరగడం దారుణం, కఠిన చట్టం చేయండి - మోదీకి మమతా లేఖ
Tirumala News: తిరుమలలో పలు దర్శనాలు రద్దు, కారణాలు ఏంటంటే
తిరుమలలో పలు దర్శనాలు రద్దు, కారణాలు ఏంటంటే
KTR: రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kolkata: డాక్టర్ చెంపలు పెదాలు మెడపై చీరుకుపోయిన గాయాలు, క్రూరత్వానికి పరాకాష్ఠ
డాక్టర్ చెంపలు పెదాలు మెడపై చీరుకుపోయిన గాయాలు, క్రూరత్వానికి పరాకాష్ఠ
Group 2 Exams Schedule: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డేట్, టైమింగ్స్ ఇవే
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డేట్, టైమింగ్స్ ఇవే
Hyderabad News: హైదరాబాద్‌లో మహిళలకు రాత్రి ఉచిత రవాణా - పోలీసుల క్లారిటీ
హైదరాబాద్‌లో మహిళలకు రాత్రి ఉచిత రవాణా - పోలీసుల క్లారిటీ
Embed widget