అన్వేషించండి
Advertisement
కిందపడిపోయిన బైకర్‌కి సాయం చేసిన రాహుల్, దెబ్బలు తగిలాయా అంటూ పరామర్శ - వైరల్ వీడియో
Rahul Gandhi: రోడ్డుపై ప్రమాదవశాత్తు పడిపోయిన బైకర్‌కి రాహుల్ గాంధీ సాయం చేశారు.
Rahul Gandhi:
రాహుల్ సాయం..
రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి తిరిగి వెళ్తుండగా నడిరోడ్డుపైనే స్కూటీపై నుంచి ఇద్దరు కింద పడిపోయారు. వెంటనే కాన్వాయ్‌ని ఆపిన రాహుల్...కార్ దిగి వాళ్ల దగ్గరకి వెళ్లారు. ఇద్దరినీ పరామర్శించారు. దెబ్బలు తగిలాయా అని అడిగారు. స్వయంగా ఆయనే స్కూటీని పైకి లేపి వాళ్లకు సాయం చేశారు. ఇద్దరితోనూ మాట్లాడి వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్లీ వెళ్లి కార్లో కూర్చున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో పోస్ట్ చేశారు. జన్నాయక్ అంటూ కాంగ్రెస్ పోస్ట్ చేసింది.
"आपको चोट तो नहीं लगी?"
— Congress (@INCIndia) August 9, 2023
रास्ते में जाते समय @RahulGandhi जी ने देखा कि एक स्कूटर चालक बीच सड़क पर गिर गया है।
वे गाड़ी रुकवाकर चालक के पास गए और उसका हाल पूछा।
जननायक ❤️ pic.twitter.com/aCeDGAMOlY
పార్లమెంట్లో చాలా దూకుడుగా ప్రసంగించారు రాహుల్ గాంధీ. మణిపూర్ అంశంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆరోపించారు. మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించిన తరవాత తొలిసారి మాట్లాడిన రాహుల్...పూర్తిగా మోదీనే టార్గెట్ చేశారు. ఆయనను రావణుడితో పోల్చిన రాహుల్...దేశాన్ని తగలబెట్టేస్తున్నారని మండి పడ్డారు.
మరోసారి జోడో యాత్ర..
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రెండోదశ యాత్ర చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే భారత్ జోడో యాత్ర రెండో దశకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించిన మహారాష్ట్రలోని ప్రతీ లోక్ సభ స్థానానికి 48 మంది పార్టీ పరిశీలకులను నియమించినట్లు పటోలే తెలిపారు. ఈ పరిశీలకులు ఆరు రోజుల్లోగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదికను సమర్పించనున్నారు. ఆ తర్వాత అంటే ఆగస్టు 16వ తేదీన కోర్ కమిటీ సమావేశం జరగనుంది.
తూర్పు విదర్భలో యాత్రకు తాను, ముంబైలో వర్ష గైక్వాడ్, పశ్చిమ విదర్భలో విజయ్ వాడెట్టివార్, ఉత్తర మహారాష్ట్రలో బాలాసాహెబ్ థోరట్, మరఠ్వాడాలో అశోక్ చవాన్, పశ్చిమ మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చవాన్ నాయకత్వం వహించబోతున్నట్లు పటోలే తెలిపారు. రాహుల్ గాంధీ తన రెండో దశ యాత్రను రాష్ట్రం నుంచి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించినట్లు గుజరాత్ కాంగ్రెస్ ప్రకటించిన మరుసటి రోజే ఇదంతా జరిగింది. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల పుట్టిన గుజరాత్ నుంచి భారత్ జోడో యాత్ర రెండో దశను ప్రారంభించాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపామని, రెండో దశ రాష్ట్రం నుంచే ప్రారంభం కావాలని గుజరాత్ ప్రతిపక్ష నేత అమిత్ చావ్డా పేర్కొన్నారు.
Also Read: రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు, స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు - స్పీకర్‌కి ఫిర్యాదు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement