సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన తల్లి సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. బహుమతిని చూసిన సోనియా గాంధీ ఆశ్చర్యపోయారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన తల్లి సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. బహుమతిని చూసిన సోనియా గాంధీ ఆశ్చర్యపోయారు. ఓ క్యూట్ కుక్క పిల్లను అమ్మకు బహుమతిగా ఇచ్చారు రాహుల్ గాంధీ. కుమారుడు ఇచ్చిన కుక్క పిల్లను తీసుకొని, ప్రేమతో ముద్దాడారు.
ఆగస్టులో రాహుల్ గాంధీ గోవాలో పర్యటించిన సమయంలో పెంపుడు కుక్కల కేంద్రాన్ని నడుపుతున్న దంపతులను కలిశారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఆడ కుక్క పిల్లను, తనతో పాటు ఢిల్లీకి తీసుకువచ్చారు. దాన్ని ఒక గిఫ్ట్ బాక్స్‌లో పెట్టి సోనియా గాంధీతోనే తెరిపించారు. శునకాన్ని ఎత్తుకుని ముద్దాడారు. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రేమగా హత్తుకున్నారు.
Rahul Gandhi brought home a Jack Russell terrier puppy after his visit to Goa.
— Team Congress (@TeamCongressINC) October 4, 2023
Presented to Sonia Gandhi.#RahulGandhi #SoniaGandhi pic.twitter.com/cOTu8zcQNc





















