వయనాడ్‌కు రాహుల్ గాంధీ, ఎంపీ సభ్యత్వం పునరుద్ధరించాక తొలిసారి పర్యటన
Rahul Gandhi Wayanad Visit: ఎంపీ సభ్యత్వం పునరుద్ధరించిన తరవాత తొలిసారి రాహుల్ వయనాడ్ పర్యటనకు వెళ్లారు.
Rahul Gandhi Wayanad Visit:
కేరళ పర్యటన..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళ పర్యటనకు వెళ్లారు. వాయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించిన తరవాత తొలిసారి కేరళకు వెళ్లారు. తన నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు. పరువునష్టం దావా కేసులో ఈ ఏడాది మార్చిలో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. 8 ఏళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమూ లేకుండా పోయింది. అయితే...రాహుల్ గాంధీ న్యాయపోరాటం చేశారు. సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. కానీ...అలహాబాద్ కోర్టు అందుకు అంగీకరించలేదు. ఫలితంగా..రాహుల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు కాపీని లోక్‌సభ స్పీకర్‌కి అందించగా..రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఆ తరవాత ఆయన లోక్‌సభలో రీ ఎంట్రీ ఇచ్చారు. మణిపూర్ అంశంపై ప్రసంగించారు.
#WATCH | Tamil Nadu: Congress leader Rahul Gandhi arrives at Coimbatore airport.
— ANI (@ANI) August 12, 2023
Rahul Gandhi is scheduled to visit his Wayanad Lok Sabha constituency after the restoration of his parliamentary membership. pic.twitter.com/pB82AT9tlF
రాహుల్‌ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతోనే రాహుల్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందన్న వాదనల నేపథ్యంలో సర్పోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కి ఉపశమనం కలిగించింది. కోర్టులో రాహుల్ తరపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన పూర్ణేష్ మోదీ ఇంటి పేరు "మోదీ" కాదని, అది భూటాల అని వివరించారు. అలాంటప్పుడు ఇది పరువు నష్టం కిందకు ఎలా వస్తుందని వాదించారు అభిషేక్. దేశంలో మోదీ ఇంటి పేరుతో 13 కోట్ల మంది ఉన్నారని, కానీ కేవలం బీజేపీకి చెందిన వాళ్లు మాత్రమే దీనిపై అనవసరంగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు. ఈ కేసులో కావాలనే రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష వేశారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
"ఈ వాదనలు పరిశీలించిన తరవాత రాహుల్‌కి గరిష్ఠ శిక్ష వేయడానికి గల కారణాలను ట్రయల్ కోర్టు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. అందుకే...రాహుల్‌ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం"
- సుప్రీంకోర్టు
భారత్ జోడో యాత్ర 2.0కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫస్ట్ ఫేజ్‌కి మంచి స్పందనే వచ్చింది. రెండోదశ యాత్ర చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే భారత్ జోడో యాత్ర రెండో దశకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెల్లడించారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన మహారాష్ట్రలోని ప్రతీ లోక్ సభ స్థానానికి 48 మంది పార్టీ పరిశీలకులను నియమించినట్లు పటోలే తెలిపారు. ఈ పరిశీలకులు ఆరు రోజుల్లోగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదికను సమర్పించనున్నారు. ఆ తర్వాత అంటే ఆగస్టు 16వ తేదీన కోర్ కమిటీ సమావేశం జరగనుంది.