ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్, పరుగులు పెట్టిన సిబ్బంది
Bomb Threat Call: పుణెకి వెళ్తున్న విస్టారా ఫ్లైట్‌లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపింది.
Bomb Threat Call:
విస్టారా ఫ్లైట్‌లో..
ఢిల్లీ నుంచి పుణేకి వస్తున్న విస్టారా ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతుకుడు కాల్ చేసి బెదిరించడం అలజడి రేపింది. GMR కాల్ సెంటర్‌కి కాల్ చేసి ఫ్లైట్‌లో బాంబు పెట్టామని ఎవరో బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఫ్లైట్‌ని ఐసోలేట్ చేసింది. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. లగేజ్‌నీ కిందకి దించింది. విమానంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం 8.53 గంటలకు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. అయితే...ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఫ్లైట్‌లో కనిపించలేదు. లోపల, బయట పూర్తిగా పరిశీలించిన సిబ్బంది పేలుడు పదార్థాలు ఏమీ లేవని చెప్పాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఈ కాల్ చేసుంటారని, ఫేక్ అయ్యుంటుందని భావిస్తున్నారు. ఫేక్ కాల్‌గా ప్రకటించారు. ప్రస్తుతానికి ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై FIR నమోదు చేశారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఆచూకీని కనిపెడతామని వెల్లడించారు.
Bomb threat on Delhi-Pune Vistara flight at Delhi airport. Inspection of the aircraft is underway in the isolation bay at the airport. All passengers along with their luggage have been deboarded safely. A call regarding a bomb on the flight was received by the GMR call centre…
— ANI (@ANI) August 18, 2023
బ్యాగ్‌లో బాంబ్ అంటూ డ్రామా..
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెకింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అధికారులు. బరువు కాస్త ఎక్కువైనా సరే...అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. కొందరు విదేశాల నుంచి పరిమితికి మించి వస్తువులు పట్టుకొస్తారు. కస్టమ్స్ అధికారులు ఫైన్ వేసి వాటిని రిలీజ్ చేస్తారు. అయితే...ఈ ఫైన్ నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ పెద్ద అబద్ధమే ఆడింది. మొత్తం అధికారులను టెన్షన్ పెట్టింది. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ఓ మహిళ లగేజ్‌ని చెకింగ్ చేసింది సిబ్బంది. బ్యాగేజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ మేరకు డబ్బులు అదనంగా చెల్లించాలని అధికారులు చెప్పారు. డబ్బలు కట్టేందుకు మనసొప్పని ఆ మహిళ తన బ్యాగ్‌లో బాంబ్ ఉందని హడలెత్తించింది. ఒక్కసారిగా సెక్యూరిటీ స్టాఫ్‌ని పరుగులు పెట్టించింది. బ్యాగ్ చెక్ చేసిన తరవాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆమె చెప్పినట్టు అందులో బాంబు లేదు. కేవలం డబ్బులు కట్టకుండా ఉండటానికి నోటికొచ్చింది చెప్పింది ఆ మహిళా ప్యాసింజర్. సీరియస్ అయిన అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మే 29వ తేదీన ఈ ఘటన జరిగింది. ఎయిర్‌లైన్స్ నిబంధనల ప్రకారం ఒక్కో బ్యాగ్ బరువు 15 కిలోలు మాత్రమే ఉండాలి. అయితే...ఆ మహిళ రెండు బ్యాగ్‌లు కలిపి 22 కిలోలపైనే ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా బ్యాగేజీకి డబ్బులు చెల్లించాలని సిబ్బంది చెప్పింది. "కట్టనంటే కట్టను" అని మహిళా ప్యాసింజర్ వాగ్వాదానికి దిగింది. ఆ తరవాతే బాంబు ఉందంటూ డ్రామా ఆడింది.
Also Read: ఇకపై వేసవిలో నో టెన్షన్, చల్లని కబురు చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం - యాక్షన్ ప్లాన్ రెడీ