ఇకపై వేసవిలో నో టెన్షన్, చల్లని కబురు చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం - యాక్షన్ ప్లాన్ రెడీ
Summer Heat In Delhi: ఢిల్లీలో వేసవి వేడిని తగ్గించేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు.
Summer Heat In Delhi:
ఢిల్లీలో యాక్షన్ ప్లాన్
ఢిల్లీలో వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎండలైనా, వానలైనా, చలైనా...విపరీతంగానే ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అదిరిపోతాయ్. వేసవి వచ్చిందంటే నరకమే. ఈ ప్రభావాన్ని కాస్త తగ్గించేందుకు ఢిల్లీ యంత్రాంగం కసరత్తులు మొదలు పెట్టింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. పలు ప్రతిపాదనలూ చేసింది. అందులో ముఖ్యమైంది...వేసవిలో స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు చేయడం. వాతావరణానికి అనుకూలంగా స్కూల్ టైమింగ్స్‌ని మార్చేసి ఎక్కువ సమయం పిల్లలు బళ్లో ఉండకుండా పంపేయాలని సూచిస్తోంది DDMA.హెల్త్ ఫెసిలిటీస్‌కి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనీ ప్రతిపాదించింది. ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలనీ చెప్పింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...డీడీఎమ్‌ఏ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లపై వైట్ పెయింట్ వేయాలని భావిస్తోంది. తద్వారా ఇళ్లలో ఉండే వాళ్లకు వేడి ప్రభావం తగ్గుతుంది. ఈ పనులన్నింటినీ సమన్వయం చేయడానికి ఓ నోడల్ ఆఫీసర్ అవసరం. ప్రస్తుతానికైతే ఇంకా ఈ పోస్ట్‌ని భర్తీ చేయలేదు. వేసవిలో దేశవ్యాప్తంగా అత్యధిక వేడితో సతమతం అయ్యే నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే విడతల వారీగా ఈ New Heat Action Planని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మూడు విడతల్లో..
ఫేజ్ -1లో వేసవి రాకముందే..అంటే ఫిబ్రవరి,మార్చి నెలల ముందే ఈ చర్యలు మొదలు పెడతారు. ముందస్తు హెచ్చరికలు చేయడం, పౌరులకు అవగాహన కల్పించడం, ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం లాంటివి చేస్తారు. ఇక మార్చి నుంచి జులై వరకు రెండో విడత ప్లాన్ అమలు చేస్తారు. ఆలయాలు, పబ్లిక్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, నైట్ షెల్టర్స్..ఇలా అన్ని చోట్లా కూలింగ్ సెంటర్స్‌ని ఏర్పాటు చేస్తారు. కూలీ పనులు చేసుకునే వాళ్లకి, మురికి వాడలో ఉండే వాళ్లకు ఈ కూలింగ్ సెంటర్‌లు ఉపశమనం కలిగిస్తాయి. మూడో ఫేజ్‌లో భాగంగా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకూ హాట్‌స్పాట్‌లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. ఇదే విధంగా వేసవిలో అత్యవసరమైన నీటిని చాలా పొదుపుగా వాడేలా చూడనున్నారు. ప్రమాదకర ప్రాంతాలకు ముందుగానే పెద్ద మొత్తంలో తాగనీరు అందిస్తారు. ఇక స్కూళ్ల విషయానికొస్తే..వేసవిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ క్లాస్‌లు నడవకుండా జాగ్రత్త పడనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మరోసారి పొంగిపొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద ఆగస్టు 14న సాయంత్రం 3 గంటలకు 203.48 మీటర్ల మేర నీటి ప్రవాహం నమోదు అయింది. అయితే ఆగస్టు 15న రాత్రి నీటి మట్టం 205.33 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని యమునా నగర్ హత్నీకుండ్ బ్యారేజీ నుంచి 30 వేల 153 క్యూసెక్కుల మేర నీరు దిగువకు విడుదల అవుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని అధాకురులు చెబుతున్నారు. అయితే జులైలో వచ్చిన వరదలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉండొచ్చని కూడా వివరిస్తున్నారు.
Also Read: Chandrayaan 3: చైనాను అధికమించిన భారత్, అరుదైన ఘనత