Emergnecy Landing: ప్రైవెట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, తప్పిన ఘోర ప్రమాదం
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక కారణాలతో టేకాఫ్ అయిన కొద్దినిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ అయింది.
Emergnecy Landing: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన కొద్దినిమిషాల్లోనే ఈ ఘటన జరిగింది. రన్‌వే మీద ల్యాండింగ్ అయిన సమయంలో విమానం అదుపు తప్పింది. నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ముందుకు దొర్లింది. ఎయిర్‌క్రాఫ్ట్ ముందు భాగం నేలను తాకుతూ ముందుకు వెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో మంటలు చెలరేగకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లకు ఎలాంటి హానీ జరగలేదు. గగుర్పాటుకు గురి చేసే విధంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రీమియర్ 1ఏ విమానం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం - HAL నుంచి ఉదయం సమయంలో బయలుదేరింది. VT-KBN, HAL నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రారంభమైంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. విమానం ముందు వైపు ఉన్న నోస్ ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ అవడంతో వెంటనే ఆ సమాచారాన్ని HAL ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు తెలియజేశారు. వెంటనే పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఆ లోపు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయ సిబ్బంది విమానం ముక్కు రన్ వేకు తగిలి మంటలు చెలరేగకుండా రన్ వే పై యాంటీ ఫైర్ ఫోమ్ స్ప్రే చేశారు.
Also Read: Top Management Institutes: భారత్‌లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఇవీ
Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn
— ANI (@ANI) July 11, 2023
వెంటనే రన్ వే పై ల్యాండ్ అయిన ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ముందు భాగం నేలను తాకుతూ ముందుకు దూసుకెళ్లింది. నోస్ ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా విమానం పక్కకు ఒరుగుతూ ఎట్టకేలకు సురక్షితంగా ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులు ఎవరూ లేరు. సీట్లలో కూర్చున్న పైలట్లకు ఎలాంటి గాయాలు కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - DGCA ఓ ట్వీట్ లో తెలిపింది.
Bengaluru: Aircraft Makes Emergency Landing At HAL Airport After Glitch With Nose Landing Gear #bengaluru #emergencylanding #halairport #scarylandings #bengaluruairport #DGCA #aviation #aircraftglitch #India pic.twitter.com/dKP0ekAoFj
— Chaitanya Kumar (@kumarchaitany0) July 12, 2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial