Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే
Prashant Kishor on Congress: కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శించారు.
Prashant Kishor on Congress: కాంగ్రెస్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్‌పై విరుచుకుపడ్డారు. ఇదో విఫల చింతన్ శిబిర్ అంటూ కౌంటర్ వేశారు.
I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir
— Prashant Kishor (@PrashantKishor) May 20, 2022
In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP!
కాంగ్రెస్‌ను కాదని
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్ మీద ఉన్న హస్తం పార్టీకి ప్రాణం నింపేందుకు ముందుకు వచ్చారు. అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు.
కొంతకాలంగా జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌లో తాను అనుకున్న పదవిని, స్థాయిని సోనియా గాంధీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఆఫర్‌ను పీకే తిరస్కరించారు.
సెకండ్ ఇన్నింగ్స్
త్వరలోనే బిహార్ నుంచి ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు పీకే తెలిపారు. 3వేల కిమీ పాదయాత్రను అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇప్పుడప్పుడే పార్టీ స్థాపనపై ఆలోచించడం లేదని ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని పీకే అన్నారు.
Also Read: Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!
Also Read: Bengaluru airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు- భద్రత పెంపు