సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం, ప్రత్యేక సమావేశాల అజెండాపై చర్చ!
All Party Meet: సెప్టెంబర్ 17న ఆల్ పార్టీ మీటింగ్‌కి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
All Party Meeting:
ఆల్ పార్టీ మీటింగ్..
ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు (Parliament Special Session) పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. అయితే ఇంత వరకూ ఈ సమావేశాల అజెండా ఏంటో మోదీ సర్కార్ ప్రకటించలేదు. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 17వ తేదీన అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక సమావేశాల అజెండాపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది.
All-party meeting called by Union Parliamentary Affairs Minister Pralhad Joshi on 17th September, ahead of Parliament special session: Sources
— ANI (@ANI) September 13, 2023
ఇదే విషయాన్ని ప్రహ్లాద్ జోషి అధికారికంగా ట్విటర్లో వెల్లడించారు.
"సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 4.30 గంటలకు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆయా పార్టీల నేతలకు ఈ సమాచారం అందించాం"
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
Ahead of the parliament session from the 18th of this month, an all-party floor leaders meeting has been convened on the 17th at 4.30 PM. The invitation for the same has been sent to concerned leaders through email.
— Pralhad Joshi (@JoshiPralhad) September 13, 2023
Letter to follow
ಇದೇ ಸೆಪ್ಟೆಂಬರ್ 18 ರಿಂದ ಆರಂಭವಾಗಲಿರುವ ವಿಶೇಷ…
ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటని ఇప్పటికే కాంగ్రెస్ ప్రశ్నించింది. అంతే కాదు. వినాయక చవితి రోజునే పార్లమెంట్ సమావేశాలకు పిలవడమేంటని మండి పడింది. NCP నేతలూ సమావేశాలు నిర్వహిస్తున్న తేదీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు."ఇండియాలోనే ప్రముఖ పండుగైన వినాయక చవితి రోజున పార్లమెంట్ సమావేశాలు పెట్టడమేంటి..? ఇది కచ్చితంగా హిందూ మనోభావాలను దెబ్బ తీయడమే. అసలు ఆ తేదీలు చూసే మేం షాక్‌కి గురయ్యాం"
- సుప్రియా సూలే, ఎన్సీపీ నేత
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాల్లో అమృత్ కాల్ గురించి చర్చించనుంది. అదే సమయంలో భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే అంశంపైనా చర్చ జరగనుందని సమాచారం. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవడం, G20 సమ్మిట్‌పైనా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇండియా పేరుని భారత్‌గా మార్చే విషయంపైనా వాడివేడి చర్చ జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీనిపై వివాదం జరుగుతోంది. G20 సమావేశాల్లోనే కేంద్రం భారత్ పేరుని ప్రమోట్ చేసింది. దీనిపై ఈ ప్రత్యేక సమావేశాల్లో ఓ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.
Also Read: Flight: విమానం బాత్రూములో ఓ జంట పాడుపని, సిబ్బంది డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల అరుపులు