News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Flight: విమానం బాత్రూములో ఓ జంట పాడుపని, సిబ్బంది డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల అరుపులు

Flight: విమానం గాల్లో ఉండగా.. ఇద్దరు ప్రయాణికులు బాత్రూములో శృంగారం చేస్తూ అభ్యంతరకర స్థితిలో కనిపించారు.

FOLLOW US: 
Share:

Flight: విమానంలో జరుగుతున్న ఏదో ఒక ఘటనకు సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రయాణికుల మధ్య గొడవలు, విమాన సిబ్బందితో వాగ్వాదం లాంటి ఘటనలతో విమాన ప్రయాణ అనుభవాలు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన వైరల్ అవుతోంది. విమానంలో ప్రయాణిస్తుండగా.. ఇద్దరు ప్రయాణికులు వ్యవహరించిన తీరు అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ప్రయాణికులు విమాన బాత్రూములో శృంగారం చేసుకుంటున్నారు. ఆ టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగానే అభ్యంతరకర స్థితిలో కనిపించారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

యూకేలోని లూటన్ నుంచి ఇబిజాకు వెళ్తున్న ఈజీ జెట్ ఫ్లైట్ లో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీన ఈ ఘటన జరగ్గా.. అప్పటి నుంచి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విమాన సిబ్బంది ఒకరు టాయిలెట్ డోర్ ముందు నిల్చొని ఉన్నారు. సిబ్బంది బయటి నుంచి తలుపు తెరవమని కోరినప్పటికీ లోపల ఉన్న జంట స్పందించలేదు. టాయిలెట్ డోర్ తీయాలని ఇతర ప్రయాణికులు అతడిని బలవంతం చేస్తున్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. ఆయన ఇబ్బందిగానే డోర్ తెరిచాడు. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి సిబ్బంది సహా అక్కడ ఉన్న ప్రయాణికులు అంతా అవాక్కయ్యారు. వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో కనిపించారు. డోర్ తీసిన విషయాన్ని గుర్తించిన లోపల ఉన్న యువకుడు వెంటనే మళ్లీ డోర్ వేసేశాడు. జంట నిర్వాకంతో కొందరు ప్రయాణికులు అవాక్కయ్యారు. మరికొందరు మాత్రం అరుపుల్లో మునిగిపోయారు. ఇంకొందరు వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా అరిచారు. ఓ ప్రయాణికుడు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఈజీ జెట్ విమానం ఇబిజాలో ల్యాండ్ కాగానే వారిని పోలీసులకు అప్పగించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. వారిని అదుపులోకి తీసుకున్నామనని, పబ్లిక్ టాయిలెట్ లో అసభ్యకరంగా ప్రవర్తించిన నేరం కింద వారిని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది మాత్రం ఈజీ జెట్ ఎయిర్ లైన్స్ వెల్లడించలేదు.

Published at : 13 Sep 2023 03:14 PM (IST) Tags: Viral News Viral Video Latest Viral Video Couple Sex on Flight Passengers Sex on Easyjet

ఇవి కూడా చూడండి

ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!

ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!

ABP Desam Top 10, 2 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 October 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!