News
News
X

BJP TDP Alliance : బీజేపీ-టీడీపీ కూటమి ఘనవిజయం, అభినందిస్తూ జేపీ నడ్డా ట్వీట్

BJP TDP Alliance :పోర్ట్ బ్లెయిల్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయంపై జేపీ నడ్డా ట్వీట్ చేశారు.

FOLLOW US: 
Share:

BJP TDP Alliance : బీజేపీ-టీడీపీ కూటమి అద్భుతమైన విజయం సాధించిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో బీజేపీ పొత్తులు లేవుకదా అనే డౌట్ రావొచ్చు. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. పోర్టు బ్లెయిర్ లో గత ఏడాది జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ 10, టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి.  బీజేపీకి టీడీపీ మద్దతు తెలపడంతో మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ పదవి ఆ కూటమికి దక్కింది. ముందు బీజేపీ అభ్యర్థి, ఆ తర్వాత టీడీపీ అభ్యర్థికి ఛైర్మన్ పదవి దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో తాజాగా టీడీపీ ఛైర్మన్ పదవి దక్కింది. కౌన్సిల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి బీజేపీ మద్దతు తెలిపింది. ఈ కూటమి విజయం సాధించడంతో జేపీ నడ్డా ట్వీట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు అని ట్వీట్ చేశారు. ఈ విజయం ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. పోర్ట్ బ్లెయిర్ ప్రజల కోసం అంకితభావంతో పనిచేశామని, అవి ఫలించాయన్నారు.    

 పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి అభ్యర్థిని ఓడించి బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థి సెల్వి విజయం సాధించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ విజయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు, కాంగ్రెస్, డీఎంకే కూటమికి 11 సీట్లు రావడంతో పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఏ పార్టీ మండలి ఏర్పాటు చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ రెండు సీట్లు సాధించి కింగ్‌మేకర్‌గా అవతరించింది. దీంతో టీడీపీ, బీజేపీకి మద్దతు తెలపడంతో ఆ కూటమి విజయం సాధించింది. ఈ కూటమి అభ్యర్థికి మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి దక్కింది. 

అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 2 స్థానాలే అయినా, పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటులో కీలకమైంది.  ఈ  ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు దక్కగా, కాంగ్రెస్ కూటమి 11 స్థానాలు గెలుచుకుంది.  దీంతో టీడీపీ మద్దతుతో బీజేపీ కౌన్సిల్ పీఠాన్ని దక్కించుకుంది.  ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళా నేత సెల్వి 5వ వార్డు, హమీద్ 1వ వార్డు నుంచి గెలుపొందారు. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ పదవిని ఫస్ట్ టర్మ్ బీజేపీ అభ్యర్థి చేపట్టారు. తాజాగా ఇప్పుడు రెండో టర్మ్ లో టీడీపీకి అవకాశం వచ్చింది. ఛైర్ పర్సన్ పదవికి టీడీపీ నేత సెల్వి పోటీపడగా ఆమెను బీజేపీ బలపరిచింది. ఛైర్ పర్సన్ బలపరీక్షలో ఎన్నికల్లో సెల్వికి 14 ఓట్లు రాగా, కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ నేత సెల్వి పోర్టు బ్లెయిర్ మున్సిపల్ ఛైర్మన్ గా విజయం సాధించారు.  
 
Published at : 14 Mar 2023 09:10 PM (IST) Tags: BJP JP Nadda Municipal Elections BJP TDP Alliance Tweet Port blair

సంబంధిత కథనాలు

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్

Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి