COVID-19 Vaccine in India: 'ఇది మీ వల్లే సాధ్యమైంది'- భారత్ రికార్డ్‌పై ప్రధాని మోదీ లేఖ
COVID-19 Vaccine in India: దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ.. టీకా ఉత్పత్తిదారులకు లేఖ రాశారు.
COVID-19 Vaccine in India: దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. కరోనా పోరాటంలో భాగంగా దేశం 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన సందర్భంగా మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Prime Minister Narendra Modi lauds all vaccinators for achieving the 200 crore vaccine doses landmark on July 17. The PM has congratulated all vaccinators by sending appreciation letters to them personally; the same can be downloaded from their CoWIN login ID pic.twitter.com/cJ5bbF7ZWZ
— ANI (@ANI) July 20, 2022
అరుదైన మైలురాయి
దేశంలో కొవిడ్–19 వ్యాక్సినేషన్‌లో భాగంగా టీకాల పంపిణీ 200 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు సహా 14 వేల చోట్ల వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మన దేశంలో 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాదాపు 18 నెలల సమయంలో 200 కోట్ల డోసుల మేర టీకాల పంపిణీ పూర్తయింది.
- తొలి 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీకి 277 రోజులు (సుమారు 9 నెలలు) పట్టింది.
- గత ఏడాది సెప్టెంబర్ 17న ఒకే రోజున దేశవ్యాప్తంగా ఏకంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించి భారత్ రికార్డ్ సృష్టించింది.
- దేశ జనాభాలో 96 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది.
- అందులో 87 శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. ఇక 5.48 కోట్ల మందికి మూడో డోసు కూడా వేశారు.
Also Read: Jharkhand News: ఝార్ఖండ్‌లో కూడా సేమ్ టూ సేమ్- మహిళా ఎస్‌ఐ దారుణ హత్య
Also Read: Sri Lanka Crisis: శ్రీలంకను అప్పుల కుంపటే కాల్చేసింది, మీరూ జాగ్రత్త!