అన్వేషించండి

Sri Lanka Crisis: శ్రీలంకను అప్పుల కుంపటే కాల్చేసింది, మీరూ జాగ్రత్త!

Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోక్షంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ విషయమై చాలా రచ్చ జరుగుతోంది. అపరిమిత అప్పులే ఆ దేశం పడిపోయేందుకు కారణమైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో, శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి కారణమైన  విషయాలను తెలిపింది. ఈ దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వివరించింది. అలాగే స్థాయికి మించి అపరిమితంగా చేసిన అప్పులే.. ఆ దేశ సంక్షోభానికి కారణమంటూ విశ్లేషణాత్మకంగా వివరించింది. ఈ క్రమంలోనే భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై కూడా విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికారులు రెండవ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

10 రాష్ట్రాల పేరు ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వం..

ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాల స్థితిగతులను ప్రదర్శించారు. ఆంధ్ర ప్రదేశ్, బిహార్, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని తెలియ జేశారు. ఏపీ రుణాలు జీఎస్డీపీలో 32 శాతానికి చేరినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, బిహీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాయటాయన్నారు. అలగే తెలంగాణ రుణాలు కూడా జీఎస్డీపీలో 25 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.

టీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, తృణమూల్ నేతల అభ్యంతరం..

శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన డేటాపై అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వైఎస్ఆర్ సిపీ, టీఆర్ఎస్, టీఎంసీ, ఏఐఎంఐఎం, డీఎంకే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శ్రీలంక పరిస్థితిపై ఏర్పాటు చేసిన సమావేశంలో జీడీపీకి సంబంధించి రాష్ట్రాల అప్పుల భారం లెక్కలపై చర్చించడం సరికాదని ఈ పార్టీల నేతలు అంటున్నారు. అవసరమైతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని రాష్ట్రాల లెక్కలను గాలికొదిలేస్తున్నారని అని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాష్ట్రాల అప్పుల లెక్కలపై చర్చ తో పాటు.. కేంద్ర ప్రభుత్వ అప్పుల లెక్కలపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 

డేటా ఆధారంగానే మాట్లాడాం.. ఎలాంటి రాజకీయ కుట్ర లేదు!

శ్రీలంకలో అస్థిరత పరిస్థితి గురించి ఆందోళన ఉందిని...  మిగతా దేశాల కంటే భారత్ శ్రీలంకకు ఎక్కువ సాయం చేసిందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందారని తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి వివరణ ఇచ్చాంమని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్పుల పరిస్థితి ఎలా ఉందో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిందన్నారు. శ్రీలంక వంటి పరిస్థితిలోకి, భారతదేశం వెళ్తుందని మేము అనుకోము. కానీ ఆర్థిక సంస్కరణలు మరియు క్రమశిక్షణను అనుసరించడమే శ్రీలంకలో పరిస్థితి నుంచి తీసుకోవాల్సిన పాఠం అని తెలియజేయాలని ప్రయత్నించామన్నారు. రాష్ట్రాల డేటా చూపించడం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదుని స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget