Parliament Of India: నూతన పార్లమెంట్‌పై 6.5 అడుగుల జాతీయ చిహ్నం- ఆవిష్కరించిన ప్రధాని
Parliament Of India: నూతన పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించారు.
Parliament Of India: నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమావారం ఆవిష్కరించారు. కాంస్యంతో రూపొందించిన ఈ చిహ్నం మొత్తం బరువు 9,500 కేజీలు కాగా, పొడవు ఆరున్నర మీటర్లు.
PM @narendramodi unveiled the National Emblem cast on the roof of the New Parliament Building today morning.
— DD News (@DDNewslive) July 11, 2022
He also interacted with the Shramjeevis involved in the work of the new Parliament.@PMOIndia pic.twitter.com/QriDbqNf0v
ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు.
The National Emblem is made of bronze with a total weight of 9500 Kg and is 6.5 m in height. It has been cast at the top of the Central Foyer of New Parliament Building. A supporting structure of steel weighing around 6500 Kg has been constructed to support the Emblem. pic.twitter.com/mG587dwZYM
— DD News (@DDNewslive) July 11, 2022
ఉద్యోగులతో
ఈ సందర్భంగా పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులతో ప్రధాని సంభాషించారు. వారు చెప్పిన వాటిని శ్రద్ధగా విన్నారు. 2020 డిసెంబర్ 10న పార్లమెంట్ నూతన భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
లక్ష్యం
స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022తో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయి.
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దీనికి హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
Also Read: Goa Political News: మహారాష్ట్రలో ముగిసింది, గోవాలో మొదలైంది- ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్!
Also Read: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట- ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం