News
News
X

Goa Political News: మహారాష్ట్రలో ముగిసింది, గోవాలో మొదలైంది- ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్!

Goa Political News: గోవాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభాలకు గురిచేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

FOLLOW US: 

Goa Political News: మహారాష్ట్రలో నరాలు తెగే ఉత్కంఠ భరిత రాజకీయాలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే గోవాలో అలజడి మొదలైంది. అధికార భాజపాలో కాంగ్రెస్‌ నేతలు చేరుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. కమలం పార్టీతో టచ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. 

ఇదీ జరిగింది

ఈ కుట్రలో భాగమైన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలపై గోవా కాంగ్రెస్‌ చర్యలు చేపట్టింది. వారిపై అనర్హత వేటుకు సిద్ధమైంది. గోవా అసెంబ్లీలో 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, కేదార్ నాయక్, రాజేష్ ఫల్దేశాయి, డెలియాలా లోబో గైర్హాజరయ్యారు.

ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసిన వారంతా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు భాజపాలో చేరుతున్నట్లుగా వార్తలొచ్చాయి. దీంతో కాంగ్రెస్‌లో చీలిక కోసం ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, భాజపాతో కుమ్మక్కై కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దినేష్ గుండూరావు ఆరోపించారు.

వేటు కోసం

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గోవా అసెంబ్లీ స్పీకర్‌ రమేష్ తవాడ్కర్‌ను కోరినట్లు గోవా పీసీసీ చీఫ్ అమిత్ పాట్కర్ తెలిపారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్ఠానం సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఎంపీ ముకుల్ వాస్నిక్‌కు గోవా పంపింది. 

రూ. 50 కోట్లు!

గోవాలో తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు.

" గోవాలో కాంగ్రెస్‌ నేతలను భాజపా ప్రలోభాలకు గురిచేస్తోంది. భాజపాలో చేరేందుకు ఒక్కో కాంగ్రెస్ నేతకు ఆ పార్టీ రూ.50 కోట్లు ఆఫర్‌ చేసిందియ. ఒక్క గోవాలోనే కాదు.. ప్రతి రాష్ట్రంలో ఆపరేషన్‌ కమల్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. కానీ కర్ణాటకలో మాత్రం ఇది సాధ్యం కాదు.                                                                "
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ సీఎం

Also Read: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట- ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం

Also Read: Vladimir Putin: 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న పుతిన్!

Published at : 11 Jul 2022 05:32 PM (IST) Tags: BJP CONGRESS Goa Digambar Kamat Goa Congress Michael Lobo Ramesh Tawadkar

సంబంధిత కథనాలు

India's Famous Artists: తమ కుంచెతో స్వతంత్య్ర పోరాట స్పూర్తిని పంచిన చిత్రకారులెందరో

India's Famous Artists: తమ కుంచెతో స్వతంత్య్ర పోరాట స్పూర్తిని పంచిన చిత్రకారులెందరో

5G Spectrum Sale: టార్గెట్‌ మిస్సైనా 5జీ స్పెక్ట్రమ్‌ వేలం విజయవంతమే! ఎందుకంటే!!

5G Spectrum Sale: టార్గెట్‌ మిస్సైనా 5జీ స్పెక్ట్రమ్‌ వేలం విజయవంతమే! ఎందుకంటే!!

India’s Space Odyssey: ఆదిత్య L1 నుంచి చంద్రయాన్ 3, గగన్‌యాన్ వరకు- ఇస్రో భవిష్యత్తు మిషన్లు ఇవే!

India’s Space Odyssey: ఆదిత్య L1 నుంచి చంద్రయాన్ 3, గగన్‌యాన్ వరకు- ఇస్రో భవిష్యత్తు మిషన్లు ఇవే!

Digital Rupee: డిజిటల్‌ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!

Digital Rupee: డిజిటల్‌ రూపాయిపై ఆర్బీఐకి ఎందుకింత ఆసక్తి! వీటితో నష్టాలేమైనా ఉన్నాయా!

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

టాప్ స్టోరీస్

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక