Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట- ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం
Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట లభించింది. ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కొహ్లీ ధర్మాసనం పేర్కొంది.
Supreme Court asks Solicitor General to inform Maharashtra Assembly Speaker to not take any decision unless the plea is decided by SC.
— ANI (@ANI) July 11, 2022
SC says this matter will require the constitution of a bench & will take some time to be listed. The matter will not be listed tomorrow.
నోటీసులు
మరోవైపు శివసేనకు చెందిన మొత్తం ఎమ్మెల్యేలకు ఇటీవల షోకాజ్ నోటీసులు అందాయి. అయితే ఈ జాబితాలో ఉద్ధవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, సీఎం ఏక్‌నాథ్ శిందే రెండు వర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర శాసనసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
Also Read: Vladimir Putin: 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న పుతిన్!
Also Read: AIADMK General Council: OPSకు పళనిస్వామి ఝలక్- పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం