![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా మోడీ నివాళులర్పించారు.
![Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ PM Modi unveiled hologram statue of Netaji Subhas Chandra Bose at India Gate on his 125th birth anniversary Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/23/517df7832565285512a2231a8c07165c_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా.. ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దానిపై నేతాజీ 3D చిత్రాన్ని ఉంచారు. హోలోగ్రామ్ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంది. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. గ్రానైట్ విగ్రహం పూర్తయ్యే వరకు హోలోగ్రామ్ విగ్రహం ఉంటుందని చెప్పారు. నేతాజీకి భారత్ రుణపడి ఉంటుందని మోడీ అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi unveiled hologram statue of Netaji Subhas Chandra Bose at India Gate on his 125th birth anniversary #ParakramDiwas pic.twitter.com/vGQMSzLgfc
— ANI (@ANI) January 23, 2022
భారతమాత వీర పుత్రుడు సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ ప్రభుత్వం ముందు తాను స్వాతంత్య్రం కోసం అడుక్కోనని, దాన్ని సాధించుకుంటానని గర్వంగా చెప్పారని మోడీ అన్నారు. నేతాజీ స్వేచ్ఛా భారతదేశానికి హామీ ఇచ్చారని.. ఆయన డిజిటల్ విగ్రహం ఉన్న స్థానంలో భారీ విగ్రహం రానుందని చెప్పారు. నేతాజీ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు గానూ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ను అందించారు. ఈ అవార్డు విపత్తు నిర్వహణలో వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలను గుర్తించి వారికి ప్రదానం చేస్తారు. ఈ అవార్డులో సంస్థలకు రూ.51 లక్షల నగదు బహుమతి, సర్టిఫికేట్ అందజేస్తారు. వ్యక్తులకు రూ.5 లక్షల నగదు బహుమతి, సర్టిఫికేట్ అందజేస్తారు.
Delhi: Prime Minister Narendra Modi unveils hologram statue of Netaji Subhas Chandra Bose at India Gate on his 125th birth anniversary #ParakramDiwas pic.twitter.com/XmKJ6LuhNk
— ANI (@ANI) January 23, 2022
హోలో గ్రామ్ విగ్రహం ప్రత్యేకతలు
ఓ పత్రిక ప్రకటనలో నేతాజీ విగ్రహం ప్రత్యేకతలను కేంద్రం వివరించింది. “హోలోగ్రామ్ విగ్రహం 30,000 ల్యూమెన్స్ 4K ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తారు. 90% పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్ సందర్శకులకు కనిపించని విధంగా ఏర్పాటు చేస్తారు. హోలోగ్రామ్ ప్రభావాన్ని సృష్టించడానికి నేతాజీ 3D చిత్రం దానిపై ప్రదర్శిస్తారు. హోలోగ్రామ్ విగ్రహం పరిమాణం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)