PM Modi Speech: మణిపూర్‌కి భారత్ అండగా ఉంటుంది, భరతమాతపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు - ప్రధాని మోదీ
PM Modi Speech: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం, మణిపూర్ అంశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi Speech:
లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం మొదలు పెట్టారు. ఎన్నో రోజులుగా మణిపూర్‌పై పార్లమెంట్లో మోదీ చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రధాని లోక్‌సభకు హాజరయ్యారు. 2018లోనూ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని గుర్తు చేసిన ప్రధాని మోదీ...ఈ సారి కూడా తీర్మానం ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, ప్రతిసారీ ఇది రుజువైందని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Lok Sabha
— ANI (@ANI) August 10, 2023
PM will speak on the No Confidence Motion, in Lok Sabha, shortly. pic.twitter.com/4wawh7ya7l
"మా ప్రభుత్వంపై ప్రజలు ప్రతిసారీ పూర్తి నమ్మకంతో ఉంటున్నారు. ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చినా ప్రజలు మావైపే ఉంటున్నారు. మాపై నమ్మకం ఉంచిన కోట్లాది మంది దేశ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను"- ప్రధాని నరేంద్ర మోదీ
"The trust of the people of the country shown in our government again and again - I am here to show my gratitude to the crores of the people of the country," says Prime Minister Narendra Modi#NoConfidenceMotion pic.twitter.com/sx3LrOEKwR
— ANI (@ANI) August 10, 2023
ఎన్నో కీలకమైన బిల్లులు చర్చించాలని భావించినా...విపక్షాల రాజకీయాల వల్ల వాటిపై చర్చ జరగుకుండా సమయం వృథా అయిందని ప్రధాని మోదీ విమర్శించారు. దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించే విషయాల కన్నా తమ రాజకీయాలే ఎక్కువైపోయాయాని మండి పడ్డారు. గత రికార్డులన్నీ బద్దలు కొట్టి NDA మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"విపక్షాలకు నేనొకటే విషయం చెబుతున్నాను. NDA,BJP గత రికార్డులన్నీ బద్దలు కొట్టి ఘన విజయం సాధిస్తుంది. దేశ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాంఠ
- ప్రధాని నరేంద్ర మోదీ
విపక్షాలు ప్రతిసారీ ప్రజల్ని నిరుత్సాహ పరుస్తూనే ఉన్నాయని విమర్శించారు ప్రధాని మోదీ. ఈ అవిశ్వాస తీర్మానాన్ని దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నామని తేల్చి చెప్పారు. 2018లోనూ విపక్షాలు ఇదే చేశాయని, ఇది తమకు ఫ్లోర్ టెస్ట్ కాదని, విపక్షాలకే అని వెల్లడించారు. విపక్ష కూటమిలోని కొందరు నేతలే ఈ అవిశ్వాస తీర్మానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ఆయన క్రికెట్ ప్రస్తావన తీసుకొచ్చి ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఫీల్డింగ్‌ని విపక్షాలే సెట్ చేసినా...తమ పక్షం నుంచే ఫోర్లు, సిక్సర్లు వెళ్లాయని ఎద్దేవా చేశారు.
"ఈ అవిశ్వాస తీర్మానంపై ఏం చర్చించారో నాకేమీ అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లు చూశాను కొంత మంది మీ కూటమిలోని కొందరు నేతలే దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డింగ్ విపక్షాలే సెట్ చేసినా మా వైపు నుంచే ఫోర్లు, సిక్సర్లు కొట్టారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది కాబట్టే 2019లో పూర్తి మెజార్టీతో గెలిపించారని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. తమ హయాంలో ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణమైనా జరిగినట్టు ఆధారాలు చూపించలగరా అని ప్రశ్నించారు. ఈ 21వ శతాబ్దం భారత్‌దేనని, ఇదెంతో కీలకమని తేల్చి చెప్పారు. అభివృద్ధిపైనే అందరి దృష్టి ఉండాలని సూచించారు. విభేదాలన్నీ పక్కన పెట్టి ఈ లక్ష్యం కోసమే పని చేయాలని అన్నారు. దేశ యువత తమ కలలను నిజం చేసుకునేందుకు ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర కీలకంగా మారుతోందని వెల్లడించారు. పార్లమెంట్‌కి విపక్ష నేతలు నల్ల దుస్తులు ధరించి వచ్చారని, దాంతో తమకు దిష్టి తాకకుండా కాపాడారని సెటైర్లు వేశారు.
బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తే బ్యాంకింగ్ రంగం నాశనమవుతుందని ప్రతిపక్షాలు గొడవ చేశాయన్న ప్రధాని మోదీ...ఇప్పుడు నిరర్థక ఆస్తులు తగ్గిపోవడమే కాకుండా వాటి ఆదాయం రెండింతలు పెరిగిందని వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని లెక్కలతో సహా వివరించారని గుర్తు చేశారు. దేశానికి మంచి జరుగుతుంటే విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు ప్రధాని మోదీ. వాళ్లు ఎంత చెడు చేయాలని చూసినా తమకు మంచే జరుగుతోందని వెల్లడించారు. 2028లోనూ అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని విపక్షాలకు సవాల్ విసిరారు. ఆ సమయానికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులో యూపీఏకి అంతిమ సంస్కారం చేశారని, అందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని సెటైర్లు వేశారు.
#WATCH | PM Narendra Modi speaks on Manipur; says, "Both the state and central governments are doing everything possible to ensure that the accused get the strictest punishment. I want to assure the people that peace will be restored in Manipur in the coming time. I want to tell… pic.twitter.com/cgI7RqSWs4
— ANI (@ANI) August 10, 2023