బర్త్‌డే రోజూ బిజీబిజీగా ప్రధాని, యశోభూమి ఎక్స్‌పో సెంటర్‌ని ప్రారంభించిన మోదీ
Yashobhoomi Inauguration: ఢిల్లీలోని యశోభూమి ఎక్స్‌పో సెంటర్‌ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
Yashobhoomi Inauguration:
యశోభూమి ప్రారంభం..
బర్త్‌డే రోజు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ ఎక్స్‌టెన్షన్‌ని ప్రారంభించిన ఆయన...ఆ తరవాత యశోభూమి ఎక్స్‌పో సెంటర్‌నీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్‌పో సెంటర్‌గా ఇది రికార్డుకెక్కింది. ఈ నిర్మాణం కోసం కేంద్రం దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఈ International Convention and Expo Centreకే యశోభూమి (Yashobhoomi) అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. కళ్లు చెదిరిపోయే కన్వెన్షన్ సెంటర్‌తో పాటు ఎగ్జిబిషన్ హాల్స్‌నీ ఇందులో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రధాని మోదీ ప్రత్యేక చొరవతో ఈ నిర్మాణం చేపట్టారు. 1.8 లక్షల చదరపు మీటర్ల మేర నిర్మాణం జరిగింది. ఇందులో కన్వెన్షన్ సెంటర్‌ని 73 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మెయిన్ ఆడిటోరియంతో కలిపి 15 కన్వెన్షన్ రూమ్స్ ఉంటాయి. గ్రాండ్ బాల్‌రూమ్‌తో పాటు 13 మీటింగ్ రూమ్స్ నిర్మించారు. 11 వేల మంది ప్రతినిధులు కూర్చున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా విశాలంగా నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు ప్రధాని. ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వాళ్లతో సెల్ఫీలు దిగారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi dedicates to the nation, the Phase 1 of India International Convention and Expo Centre (IICC), called ‘YashoBhoomi’, at Dwarka. pic.twitter.com/inNBeN3SvJ
— ANI (@ANI) September 17, 2023
ఈ ఎక్స్‌పో సెంటర్‌ని ప్రారంభించిన తరవాత అక్కడి కళాకారులతో మాట్లాడారు ప్రధాని. ప్రదర్శనకు ఉంచిన ప్రతి వస్తువు గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మోదీ వచ్చి తమతో మాట్లాడినందుకు వాళ్లంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతలు ట్వీట్లు చేశారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని విషెస్ చెప్పారు. తల్లి లేకుండా ప్రధాని మోదీ జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇదే. ఇటీవలే ఆమె కన్నుమూశారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi interacts with artisans and craftspeople at India International Convention and Expo Centre, Dwarka. pic.twitter.com/7QbdWL6tPJ
— ANI (@ANI) September 17, 2023
ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యశోభూమి ఓపెనింగ్ కోసం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధానికి ఓ మహిళ విషెస్ చెప్పింది. అది కూడా సంస్కృతంలో పాట పాడుతూ. ఈ పాట విని చిరునవ్వులు చిందించారు ప్రధాని మోదీ.
#WATCH | A traveller in Delhi Metro wishes Prime Minister Narendra Modi in the Sanskrit language on his 73rd birthday. pic.twitter.com/7inQ7Pt4Th
— ANI (@ANI) September 17, 2023
Also Read: Viral Video: ట్రెడ్మిల్ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో