PM Modi Oath Ceremony LIVE: ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం - కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగు ఎంపీలు
PM Modi Oath Taking Ceremony LIVE Updates: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.
LIVE
Background
PM Modi Oath Ceremony LIVE Updates: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ తరవాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు మోదీ రాజ్ ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు. మోదీ ప్రమాణస్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. విదేశాధినేతలు ఉండే హోటళ్ల వద్దా సెక్యూరిటీ పెంచారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఫేషియల్ రికగ్నిషన్ చేయనున్నారు. ఆ మేరకు భద్రతా వలయాన్ని మరింత పెంచారు. ఈ కార్యక్రమానికి ఎన్జీయే కూటమి ఎంపీలు సహా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలన్నీ బీజేపీ వద్దే ఉన్నాయి. హోం మంత్రిగా అమిత్ షా, రక్షణశాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ కొనసాగనున్నారు. వాళ్ల మంత్రిత్వ శాఖల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగు ఎంపీలు ఎవరంటే..
న్యూఢిల్లీ: కిషన్ రెడ్డి చెప్పినట్లుగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురంలో నెగ్గిన బీజేపీ ఎంపీ శ్రీనివాస శర్మలతో రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. మోదీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు, ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. వీరితో పాటు వ్యాపార ప్రముఖులు ముఖేష్ అంబానీ, సిని సెలబ్రిటీలు కొందరు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణం, నెగ్గిన తొలిసారే కేబినెట్ బెర్త్
PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము గుంటూరు ఎంపీ పెమ్మసానితో ప్రమాణం చేయించారు. ఎంపీగా నెగ్గిన తొలిసారే ప్రధాని మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.
PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రులుగా చిరాగ్ పాస్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజీత్ సింగ్ ప్రమాణం
చిరాగ్ పాస్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజీత్ సింగ్‌లు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ముర్ము సీఆర్ పాటిల్, ఇంద్రజీత్ సింగ్, చిరాగ్ పాస్వాన్ లతో కేంద్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
Kishan Reddy Takes Oath As Union Minister: కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, మోదీ 3.0 కేబినెట్‌లో చేరిక
Kishan Reddy Oath Taking Ceremony: మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. మొదట ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, తదితరులు ప్రమాణం చేశారు. తెలంగాణకు చెందిన ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డితో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రులుగా ప్రహ్లాద్ జోషి, జువల్ ఓరం, గిరిరాజ్ సింగ్
కేంద్ర మంత్రులుగా జువల్ ఓరం, గిరిరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషి ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ఆ నేతలతో కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయించారు.