News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఇస్రోలో ప్రధానమంత్రికి ఘనస్వాగతం-చంద్రయాన్‌- 3 టీంను అభినందించిన మోదీ

చంద్రయాన్-3 మిషన్ విజయానికి కారణమైన శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని మోదీ బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) చేరుకున్నారు.

FOLLOW US: 
Share:

చంద్రయాన్‌-3లో భాగమైన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ భుజం తట్టి అభినందించారు. దక్షిణాఫ్రికా గ్రీస్‌ పర్యటన ముగించుకొని నేరుగా ఇస్రో చేరుకున్నారు ప్రధానమంత్రి. అక్కడ ఆయనకు శాస్త్రవేత్తలు ఘనస్వాగతం పలికారు. 

ముందుగా బెంగళూరులోని హాల్ విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడ కాసేపు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ఇస్రో చేరుకున్నారు. అక్కడ ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌కు చేరుకున్నారు.  అక్కడే శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రసంగించారు 

అంతకు ముందు దక్షిణాఫ్రికా గ్రీన్‌ నుంచి నేరుగా బెంగళూరు వచ్చారు ప్రధానమంత్రి. ప్రపంచమే ఆశ్చర్యపోయే విజయాన్ని సొంత చేసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలను నేరుగా అభినందించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌ పర్యటన తర్వాత తన షెడ్యూల్‌ను పూర్తి గా మార్చేశారు. నేరుగా ఢిల్లీ రాకుండా బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. 

గ్రీస్ పర్యటన ముగించుకొని బెంగళూరు వచ్చిన ప్రధానమంత్రి మోదీకి ఘనస్వాగతం లభించింది. అక్కడ ఎయిర్‌పోర్టుల దిగిన వెంటనే స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జై విజ్ఞాన్‌... జై అనుసంధాన్‌ అంటూ స్లోగన్స్‌ ఇచ్చారు.  ఇది శాస్త్రవేత్తలకు మరింత బూస్టు అవుతుందన్నారు. 

బెంగళూరు వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి  రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎంగానీ, డిప్యూటీ సీఎంగానీ ఎవరూ రాలేదు. దీనిపై మోదీ మాట్లాడుతూ... శాస్త్రవేత్తలతో సమావేశమై వెళ్లిపోతాను కాబట్టి నేనే ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు రావద్దని చెప్పాను. 

ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ వర్గాలను అడిగితే... ప్రధాని వస్తున్నట్టు తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పుకొచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇస్రో చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. 

బెంగళూరులో ల్యాండ్ అవుతున్న టైంలో ఓ ట్వీట్ చేశారు ప్రధాని. చంద్రయాన్ -3 విజయంతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన శాస్త్రవేత్తలను కలుస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్పేస్ సెక్టార్లో మరిన్ని అద్భుతాలు సాధించి దేశాన్ని నడిపించడానికి  శాస్త్రవేత్తల డెడికేషన్ డ్రైవింగ్ ఫోర్సుగా ఉంటుందన్నారు. 

Published at : 26 Aug 2023 08:10 AM (IST) Tags: BRICS SUMMIT Modi Narendra Modi Prime Minister ISRO South Africa Karnataka Greece Chandrayaan 3 Chandrayaan-3 HAL Airport ISTRAC

ఇవి కూడా చూడండి

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం

NCPతో మాది రాజకీయ మైత్రి మాత్రమే, దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు

NCPతో మాది రాజకీయ మైత్రి మాత్రమే, దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

LCA Tejas: ఎల్సీఏ తేజస్ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు అందించిన హెచ్ఏఎల్

LCA Tejas: ఎల్సీఏ తేజస్ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు అందించిన హెచ్ఏఎల్

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్