అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు కాంగ్రెస్‌కు థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ
బుధవారం నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి మోదీ. ఆ దేశ అధ్యక్షుడితో భేటీ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానిస్తున్న అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
'నా అమెరికా పర్యటన కోసం ఉత్సాహంగా వేచి చూస్తున్న కాంగ్రెస్ సభ్యులకు, ఇతరులకు నేను కృతజ్ఞుడిని' అని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ఏమన్నారంటే.
తన అమెరికా పర్యటన కోసం యూఎస్ కాంగ్రెస్ సభ్యులతో సహా వివిధ రంగాల ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని, ఇలాంటి మద్దతు ఇండో-అమెరికా సంబంధాల గొప్పదనాన్ని తెలియజేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్ ఖాతాకు మోదీ ట్యాగ్ చేశారు, ఇందులో యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, వ్యాపార నాయకులు, భారతీయ అమెరికన్లు సహా పలువురి వీడియోలు ఉన్నాయి.
People from all walks of life including Members of Congress, thought leaders and others have been sharing their enthusiasm on my upcoming USA visit. I thank them for their kind words. Such diverse support underlines the depth of the India-USA relationship. https://t.co/lNXuQxtzJs
— Narendra Modi (@narendramodi) June 19, 2023
జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు, న్యూయార్క్‌లో యోగా డే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని చివరిసారిగా 2016లో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
#WATCH | PM @narendramodi departs from New Delhi for his first official State visit to the United States.
— DD News (@DDNewslive) June 20, 2023
PM will attend #YogaDay2023 celebrations at the @UN HQ in New York and hold talks with US President Joe Biden & address the Joint Session of the US Congress in… pic.twitter.com/UXZlN24vF1
ప్రధాని మోదీ జూన్ 20 నుంచి అమెరికా, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించనున్నారు. ఇరు దేశాలతో ఇప్పటికే బలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. బలమైన సాంకేతిక భాగస్వామ్యాన్ని నిర్మించడం, భారత్, అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చడం ప్రధాని వాషింగ్టన్ పర్యటనలో ముఖ్యమైన అంశం.
యోగా దినోత్సవం అనంతరం ప్రధాని మోదీ జూన్ 6న వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. అక్కడ శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమవుతారు. జూన్ 22 సాయంత్రం ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ విందు ఇవ్వనున్నారు. ఈ నెల 22న జరిగే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది రెండోసారి. అంతకుముందు 22లో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
జూన్ 23న పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రొఫెషనల్స్, ఇతరులతో ప్రధాని మోదీ చర్చలు జరనున్నారు. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో కూడా ఆయన సమావేశమవుతారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జూన్ 23న ప్రధానికి విందు ఇవ్వనున్నారు. జూన్ 23న వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి 25 వరకు ఈజిప్టులో పర్యటించనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ దేశంలో పర్యటిస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ సిసి అదే సమయంలో ఈజిప్టు పర్యటనకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. ప్రధాని హోదాలో మోదీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈజిప్టులోని సీనియర్ ప్రముఖులు, కొందరు ప్రముఖులు, ఈజిప్టులోని భారతీయ కమ్యూనిటీతో ప్రధాని మోదీ మాట్లాడతారు. అల్ హకీం మసీదును కూడా ఆయన సందర్శించనున్నారు. మార్చిలో ఈజిప్టు అధ్యక్షుడు భారత పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన 'ఇండియా యూనిట్'తో కూడా ప్రధాని చర్చిస్తారు. ఈ యూనిట్‌లో పలువురు ఉన్నతస్థాయి మంత్రులు ఉన్నారు. ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా కొన్ని ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial