PM Modi On Operation Sindoor: దటీజ్ ఇండియా- పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Parliament Monsoon Session | ఈ పార్లమెంట్ సమావేశాలు మన విజయానికి జరుపుకుంటున్న సంబరాలు అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ సైనిక పరాక్రమాన్ని ప్రపంచం చూసిందని పేర్కొన్నారు.

PM Modi About Parliament Monsoon Session | న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంలో సాధించిన ప్రధాన విజయాలను ప్రస్తావించారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ అని అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పామని, ఇది భారత విజయం అన్నారు. ప్రపంచం ముందు భారతదేశ సైనిక పరాక్రమాన్ని చాటి చెప్పామని పేర్కొన్నారు.
22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ వర్షాకాల సమావేశం మన విజయానికి వేదిక. భారతదేశ సైనిక శక్తిని ప్రపంచం మొత్తం చూసింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని నూటికి నూరుపాళ్లు సాధించింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను కేవలం 22 నిమిషాల్లోనే నేలమట్టం చేశారు.” ఈ ఆపరేషన్‌ను భారతదేశం ఉగ్రవాదంపై తీసుకున్న దృఢమైన వైఖరికి చిహ్నంగా, వ్యూహాత్మక విజయంగా ప్రధాని కొనియాడారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదంతో ఇబ్బంది పడిన ప్రాంతాలలో సైతం నక్సలిజం తగ్గుముఖం పట్టింది. ఇది సమన్వయంతో కూడిన, ప్రభావవంతమైన చర్యలు చేపట్టారని దేశ భద్రతా దళాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
#WATCH | Delhi: PM Modi says, "There was a time in the country before 2014 when the inflation rate was in double digits. Today, with the rate dropping to around two per cent, it has become a relief and a convenience in the lives of the common people in the country. 25 crore poor… pic.twitter.com/AfwgvV44eN
— ANI (@ANI) July 21, 2025
ఆర్థిక మైలురాళ్ళు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు
గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక విజయాలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ద్రవ్యోల్బణం అప్పుడు రెండంకెలలో ఉందన్నారు. “నేడు రేటు దాదాపు 2 శాతానికి తగ్గడంతో, ఇది దేశంలోని సామాన్య ప్రజల జీవితాల్లో ఉపశమనం కలిగించిందని మోదీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఒక ముఖ్యమైన సామాజిక మైలురాయిని కూడా హైలైట్ చేశారు. “25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు. దీనిని ప్రపంచంలోని అనేక సంస్థలు ప్రశంసిస్తున్నాయి. ఆర్థిక స్థితిస్థాపకతలో భారతదేశం సాధించిన ప్రగతి’ ఇదేనన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలతో పాటు పాక్, భారత్ యుద్ధానికి విరామం తన విజయమని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ లో ప్రధాని మోదీ వీటికి బదులివ్వాలని అప్పుడే ఓ క్లారిటీ వస్తుందని విపక్ష నేతలు అంటున్నారు. మూడు నెలలు ముగిసినా పహల్గాం ఉగ్రదాది నిందితులను మోదీ సర్కార్ పట్టుకోలేకపోయిందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.






















