By: ABP Desam | Updated at : 12 May 2022 04:25 PM (IST)
Edited By: Murali Krishna
ప్రధాని మోదీ ఎమోషనల్- ఆ పాప చెప్పింది విని మాటలు మూగబోయాయ్!
Utkarsh Samaroh:
ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో గురువారం వర్చువల్ వేదికలో ముచ్చటిస్తోన్న సమయంలో ఓ యువతి మాటలు విని మోదీ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు.
#WATCH | While talking to Ayub Patel, one of the beneficiaries of govt schemes in Gujarat during an event, PM Modi gets emotional after hearing about his daughter's dream of becoming a doctor & said, "Let me know if you need any help to fulfill the dream of your daughters" pic.twitter.com/YuuVpcXPiy
— ANI (@ANI) May 12, 2022
ఏం జరిగింది?
గుజరాత్ బరూచ్‌లో జరిగిన ఉత్కర్ష్ సమరోహ్‌లో లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని తన పిల్లలను ఏం చదివించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి ఆ వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లలో ఒక అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంటుందని బదులిచ్చాడు.
దీంతో ప్రధాని.. ఆ పాపను తాను ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని మోదీ ఎమోషనల్ అయ్యారు.
అనంతరం ఆ పాపతో "నీ దయే నీ బలం" అని మోదీ ప్రశంసించారు.
పథకాల గురించి
ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమాచారం తెలియకపోవడం వల్ల, అవి కాగితానికే పరిమితమవుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. తెలుసుకోకపోవడం వల్ల అర్హత లేని వ్యక్తులు ప్రయోజనం పొందుతారని మోదీ అన్నారు. అధికారులు కూడా వీటి గురించి ప్రజలకు వివరించాలన్నారు.
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Delhi Dog Man : కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ - ఢిల్లీలో ఐఏఎస్ అఫీసర్ నిర్వాకం !
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !
Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు
Navjot Sidhu: సీఎం అవ్వాలనుకుంటే చివరికి క్లర్క్‌గా- సిద్ధూ జీతం ఎంతో తెలుసా?
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!