మణిపూర్ హింసపై INDIA కీలక నిర్ణయం, 2 రోజుల పాటు ఎంపీల పర్యటన
Parliament Monsoon Session: ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు జులై 29,30వ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్నారు.
Parliament Monsoon Session:
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్న INDIA కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29,30వ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్నట్టు ప్రకటించింది. కొంత మంది ఎంపీలు అక్కడ పర్యటిస్తారు.
A team of INDIA alliance MPs to visit Manipur on 29-30 July
— ANI (@ANI) July 27, 2023
ఇప్పటికే పార్లమెంట్‌ని ఇది కుదిపేస్తోంది. ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమే అని ప్రకటించింది. అయినా...ప్రధాని మోదీ పార్లమెంట్లో దీని గురించి మాట్లాడాలని నినదిస్తున్నాయి విపక్షాలు. ఇన్ని రోజులు పార్లమెంట్‌కే పరిమితమైన ఈ పోరాటం...ఇప్పుడు మణిపూర్‌లోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండ్రోజుల పర్యటనకు పలువురు ఎంపీలు వెళ్లనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ పర్యటించారు. అక్కడి బాధితులను కలిసి మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ పర్యటన తరవాత విపక్షాల మాటల దాడి మరింత పెరిగింది. కాంగ్రెస్‌కి కూడా బీజేపీపై పోరాడేందుకు ఓ అస్త్రం దొరికినట్టైంది. ఇప్పుడు INDIA కూటమిలోని కీలక నేతలు అక్కడ పర్యటించడం ద్వారా పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నా కాసేపటికే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. మణిపూర్ విషయంలో ప్రధాని మౌనంగా ఉన్నారని మండి పడ్డారు. కేవలం ఆయన వైఖరి వల్లే మణిపూర్‌కి ఈ గతి పట్టిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా వీడియో విడుదల చేసిన రాహుల్ గాంధీ...మోదీ RSSకి మాత్రమే ప్రధాని అని సెటైర్లు వేశారు. ఇంఫాల్ వెళ్లి ఓసారైనా అక్కడి పౌరులతో మాట్లాడారా అని ప్రశ్నించారు.
"ఓ రాష్ట్రం ఇలా రెండు నెలలుగా తగలబడిపోతున్నా ప్రధాని నోరు మెదపడం లేదు. కనీసం ఓ సారైనా ఇంఫాల్ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారా..? మోదీని ప్రజలే ఎన్నుకున్నారు. అలా ఎన్నుకుంటేనే ప్రధాని అయ్యారు. కానీ ఆయన RSS ప్రధాని ఇప్పుడు అర్థమవుతోంది. కేవలం ఆయన వైఖరి కారణంగానే మణిపూర్ తగలబడుతోంది. ఈ విషయం మోదీకి కూడా తెలుసు. అక్కడి ప్రజలు ఎంత బాధ పడినా, మహిళలకు అవమానం జరిగినా ఆయన ఏం పట్టనట్టు ఉంటున్నారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
प्रधानमंत्री नरेंद्र मोदी जी मणिपुर के लिए क्या कर रहे हैं?
— Congress (@INCIndia) July 27, 2023
वे मणिपुर के बारे में कुछ बोल क्यों नहीं रहे हैं?
ऐसा इसलिए है क्योंकि नरेंद्र मोदी जी को मणिपुर से कोई लेना देना नहीं है।
वो जानते हैं कि उनकी ही विचारधारा ने मणिपुर को जलाया है।
: @RahulGandhi जी pic.twitter.com/Hj8jF6Orrp
Also Read: ముంబయిలో దంచి కొట్టిన వానలు, రెడ్ అలెర్ట్ ప్రకటించిన IMD - విద్యాసంస్థలకు సెలవు