Andhra Pradesh Assembly Sessions Breaking News: ఐదేళ్లు ప్రతీకార రాజకీయాలు- గవర్నర్ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే
Budget Session of Parliament Live Updates: 2024-25 బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి. మంగళవారం సభలో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
LIVE

Background
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎన్డీఏ సభ్యుల సమావేశం
అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యుల సమావేశం. సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
Andhra Pradesh Assembly Sessions Breaking News: పెట్టుబడులు రాకపోగా ఉన్న సంస్థలను తరిమేశారు: గవర్నర్
Andhra Pradesh Assembly Sessions Breaking News: ఐదేళ్ల ప్రతిపార రాజకీయపాలనతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు గవర్నర్. పెట్టుబడులు రాకపోగా ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని తెలిపారు. ప్రాజెక్టులపై మూలధన వ్యయాన్ని 56 శాతానికి తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Andhra Pradesh Assembly Sessions Breaking News: వైసీపీ నినాదాల మధ్యే సాగుతున్న గవర్నర్ ప్రసంగం
Andhra Pradesh Assembly Sessions Breaking News: వైసీపీ సభ్యుల నినాదల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అశాస్ర్రీయ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని గుర్తు చేశారు. 2014-19 మధ్య రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఐదేళ్ల పాలన రివేంజ్ పాలన మాత్రమే సాగిందని గవర్నర్ వెల్లడించారు. వైసీపీ హయాంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారన్నారు.
Andhra Pradesh Assembly Sessions Breaking News: గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అడ్డంకి- సేవ్ అంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు
Andhra Pradesh Assembly Sessions Breaking News: గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. నల్ల కండువాలతో వచ్చిన వైసీపీ సభ్యులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని రక్షించాలంటూ గట్టిగా నినదించారు.
లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగు ఎంపీల ప్రశ్నలు అడుగుతున్న ప్రశ్నలు ఇవే
కేంద్ర పథకాల ద్వారా ఏపీకి అందిన నిధుల వివరాలు తెలపాలని కోరిన టీడీపీ ఎంపీలు దగ్గమళ్ల ప్రసాద రావు, కేశినేని శివనాథ్. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు ఇచ్చిందా అని మరో ప్రశ్న వేశారు. ఆ నిధుల ఖర్చుపై రాష్ట్రప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇచ్చిందా అంటూ మరో ప్రశ్న వేశారు.
యువతకు శిక్షణ కోర్సులపై ప్రశ్నలు అడిగిన టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు కోరిన ఎంపీలు. జిల్లాలవారిగా ఆ నిధుల వినియోగం వివరాలు తెలపాలని కోరిన ఎంపీలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

