అన్వేషించండి

Gujarat Love Marriage Conditions: ప్రేమ పెళ్లిచేసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి - గుజరాత్‌లో చట్టం - ఈ పెద్దోళ్లున్నారే?

Gujarat: గుజరాత్ ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పెను మార్పులు చేసింది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకునే జంటలకు సంబంధించి తల్లిదండ్రుల ప్రమేయాన్ని పెంచేలా ఈ నిబంధనలు ఉన్నాయి.

Parents permission For love: గుజరాత్‌లో ఇకపై ప్రేమ వివాహం చేసుకోవడం అంత సులువు కాదు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుందామనుకునే ప్రేమికులకు గుజరాత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి చేసిన తాజా సవరణల ప్రకారం, పెళ్లి చేసుకోబోయే జంట తాము ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామో లేదో అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అంతేకాదు, వారి ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు ,  అడ్రస్ వివరాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించడం తప్పనిసరి చేశారు.

ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైన అంశం తల్లిదండ్రులకు నోటీసు . జంట దరఖాస్తు చేసుకున్న 10 వర్కింగ్ డేస్‌ల్లో, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వారి తల్లిదండ్రులకు వాట్సాప్, ఎస్సెమ్మెస్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమాచారం వెళ్తుంది. అంటే, ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వారి గుట్టును ప్రభుత్వమే నేరుగా తల్లిదండ్రులకు విప్పుతుందన్నమాట. సనాతన సంప్రదాయాలను రక్షించేందుకు , మోసపూరిత వివాహాలు అంటే లవ్ జిహాద్ వంటివి అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి  చెబుతున్నారు. 

మరో ముఖ్యమైన మార్పు 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ . దరఖాస్తు చేసుకున్న వెంటనే పెళ్లి సర్టిఫికేట్ రాదు. కనీసం 30 రోజుల పాటు వేచి ఉండాలి. ఈ గడువులోగా పెళ్లికి సంబంధించి ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, వాటిని అధికారులు పరిశీలిస్తారు. అలాగే, పెళ్లి ఫోటోలు, వివాహ ఆహ్వాన పత్రిక ,  సాక్షుల వివరాలను కూడా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.        

అయితే, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  మైనార్టీ దాటినా తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను ఈ చట్టం హరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రమేయం పెంచడం వల్ల ప్రేమ జంటలపై దాడులు , వేధింపులు పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్న ప్రభుత్వం, త్వరలోనే దీనిని పూర్తిస్థాయి చట్టంగా అమలు చేయనుంది.                                                                         

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Arrest: తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు! త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై కేసులు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు! త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై కేసులు
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Reasons For Prashant Kishor Win: బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget