అన్వేషించండి

G20 Summit: ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లలో వెళ్తే బెటర్- పోలీసుల కీలక సూచనలు

G20 Summit: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో G20 సమ్మిట్‌ జరుగనున్న నేపథ్యంలో నోయిడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

G20 Summit: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో G20 సమ్మిట్‌ జరుగనున్న వేళ నోయిడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షల గురించి పలు సూచనలు ఇచ్చారు. పలు రూళ్లలో వాహనాల రాకపోకలను నిషేధించారు. కొన్నింటిని దారి మళ్లించారు. నోయిడా సరిహద్దు నుంచి ఢిల్లీకి భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాల ప్రవేశంపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.

చిల్లా రెడ్ లైట్ (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు చిల్లా రెడ్ లైట్ వద్ద యూ-టర్న్ తీసుకొని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించి తమ గమ్యస్థానం వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీ-నోయిడా-డైరెక్ట్ (DND) ఫ్లై ఓవర్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు DND టోల్ ప్లాజా వద్ద యు-టర్న్ తీసుకొని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా తమ గమ్యస్థానం వైపు వెళ్లడానికి పోలీసులు అనుమతించారు

కాళింది కుంజ్ యమునా (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు యమునా నది మొదటి అండర్‌పాస్ ట్రై-సెక్షన్ నుంచి మళ్లిస్తారు. తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా వెళ్లాలి. న్యూ అశోక్ నగర్ (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు, డీఎస్‌సీ రోడ్ నుంచి వచ్చే ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, డీఎస్‌సీ రోడ్‌లో గోల్చక్కర్ చౌక్ సెక్టార్ 15 ద్వారా వెళ్లేలా డైవర్ట్ చేశారు. కొండ్లీ/ఝుంద్‌పురా సరిహద్దు కొండ్లీ/ఝుంద్‌పురా (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు స్టేడియం చౌక్, సిటీ ప్రాంతం మీదుగా ప్రయాణించాలి.

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా నుంచి ఢిల్లీ వైపు వెళ్లే భారీ వాహనాలతోపాటు ఇతర వాహనాలను యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై నిషేధించారు. పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి వంటి నిత్యావసర వస్తువుల రవాణా వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఇవే ఆంక్షలు విధించారు. పారి చౌక్ నుంచి నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఢిల్లీ, లేదా ఇతర ప్రాంతాలలోకి ప్రవేశించే వాహనాలు హోండా సీల్ చౌక్, సిర్సా గోల్చక్కర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గాన్ని తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించారు. P-03 గోల్చక్కర్ గ్రేటర్ నోయిడా వారికి కూడా ఇదే వర్తిస్తుంది.

సూరజ్‌పూర్ ఘంటా చౌక్ నుంచి పారి చౌక్‌కు మీదుగా ఢిల్లీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సూరజ్‌పూర్ ఘంటా చౌక్, తిల్పటా గోల్‌చక్కర్, సిర్సా గోల్చక్కర్, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా తమ గమ్యస్థానం వైపు వెళ్లవచ్చు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే నుంచి ఢిల్లీ, ఇతర ప్రాంతాలలోకి ప్రవేశించి నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించే వాహనాలు జెవార్ కస్బా, సబౌటా అండర్‌పాస్, జహంగీర్‌పూర్, ఖుర్జా, సికింద్రాబాద్, బులంద్‌షహర్‌లకు బైపాస్ ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు.

మెట్రోను వినియోగించుకోండి
గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా, ఢిల్లీ మధ్య ప్రయాణించేటప్పుడు ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. నోయిడా ట్రాఫిక్ పోలీస్ 99710 09001, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ 1095/011-25844444 నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు తక్షణ సాయం అందించడానికి వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్ 87508 71493ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సూచనల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే ప్రజలకు తెలియజేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget