News
News
X

Nithish Kumar: కేసీఆర్ సభకు నితీష్ కుమార్ రావట్లేదట - బీఆర్ఎస్‌తో స్నేహంపై కూడా క్లారిటీ!

Nithish Kumar: తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీష్ కుమార్ రావట్లేదని ఆయనే స్వయంగా తెలిపారు.

FOLLOW US: 
Share:

Nithish Kumar: తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17వ తేదీ అంటే ఆయన పుట్టిన రోజు నాడే తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలు పార్టీల అధినేతలను, సీఎంలను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అదే రోజు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ కు సైతం ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఫిబ్రవవరిలో నిర్వహించనున్న కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అదివారం వెల్లడించారు. సమాధాన్‌ యాత్రలో భాగంగా ఆదివారం కైమూర్ జిల్లాలో పర్యటించిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు.

పనులు ఎక్కువగా ఉండడం వల్ల వెళ్లలేకపోతున్నానని..

హైదరాబాద్ లో కేసీఆర్ నిర్వహించే సభకు హాజరైనంత మాత్రానా.. కాంగ్రెస్ తో తమకున్న భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి విపక్షాలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను ఇంకా విరమించలేదని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర ముగింపు అనంతరం ఈ సన్నాహాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ తనను ఆహ్వానించారని.. అయితే చాలా పనులు ఉండడంతో వెళ్లలేకపోతున్నానని తెలిపారు. అంతేకాకుండా పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు కూడా ఈ విషయం చెప్పాలని సీఎం కేసీఆర్ తనతో ఫోన్ లో కోరారని అన్నారు. 

తనకు బదులుగా జనతాదళ్ అధ్యక్షుడు వెళ్తున్నట్లు సమాచారం 

తన బదులు తేజస్వీ యాదవ్, జనతాదళ్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్(లలన్ సింగ్) ఆ కార్యక్రమానికి హాజరు అవుతారని పేర్కొన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సభకు హాజరైనా కాంగ్రెస్ తో భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు, లెఫ్ట్ పార్టీల నాయకులు హాజరు అయ్యారు. ఈ సభ గురించి నితీష్ విలేకరులను ప్రశ్నించగా... ఈ సభకు తనను ఎవరూ పిలవలేదని, పిలిచినా వచ్చి ఉండే వాడిని కాదంటూ గతంలో పేర్కొన్నారు. 

Published at : 30 Jan 2023 02:18 PM (IST) Tags: Nitish Kumar Tesjashwi Yadav Rajiv Ranjan Singh CM KCR Hyderabad Event Nithish Kumar News

సంబంధిత కథనాలు

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

Ahmedabad News: ఆప్ బీజేపీ మధ్య ఆగని పోస్టర్ల పంచాయితీ, 8 మంది అరెస్ట్

Ahmedabad News: ఆప్ బీజేపీ మధ్య ఆగని పోస్టర్ల పంచాయితీ, 8 మంది అరెస్ట్

India-China Border: చైనా కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది, భారత్‌కే మా ఫుల్ సపోర్ట్‌ - అమెరికా

India-China Border: చైనా కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది, భారత్‌కే మా ఫుల్ సపోర్ట్‌ - అమెరికా

Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్

Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్

టాప్ స్టోరీస్

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?