అన్వేషించండి

Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను

Nitish Kumar Bihar Politics: నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్న తరుణంలో ఆయన సోదరుడు సతీష్ కుమార్ కొత్త సీఎం పదవికి నిశాంత్ కుమార్ పేరును ప్రతిపాదించారు.

పాట్నా: బిహార్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకోనుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన సోదరుడు సతీష్ కుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా జెడియు (JDU) నాయకుడు, నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ పేరును తెరపైకి తెచ్చారు. సతీష్ కుమార్ చేసిన ఈ ప్రకటన బిహార్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.

పాట్నాలో మీడియాతో మాట్లాడిన సతీష్ కుమార్.. నిశాంత్ కుమార్ అన్ని విధాలా సీఎం పదవికి సమర్థుడని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఒకవేళ నిశాంత్ కుమార్‌పై నమ్మకం ఉంచి ఆయనకు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తే, ఆయన దానిని చక్కగా నిర్వహిస్తారు. ఆయన మానసికంగా ఆరోగ్యంతో ఉన్నారు. బిహార్‌ను నడిపించే బాధ్యత ఆయన భుజాలపై పెడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని అన్నారు.

 రాజ్యసభకు నితీష్ కుమార్
ఇటీవల బిహార్‌లోని 5 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ బాట పడుతున్నారు. దీనిపై సతీష్ కుమార్ స్పందిస్తూ.. ఆయన బిహార్ వదిలి వెళ్లాలని రాష్ట్రంలో ఎవరూ కోరుకోవడం లేదన్నారు. అయితే రాజ్యసభకు వెళ్లాలనేది నితీష్ కుమార్ సొంత నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం సీఎం నితీష్ తన 'సమృద్ధి యాత్ర' ద్వారా పలు పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి నిశాంత్ కుమార్ ఎంట్రీ..

'బిహార్ దివస్' సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన జెడియు కార్యకర్తలు, సామాన్య ప్రజలతో మమేకమై జేడీయూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నారు.

నిశాంత్‌కు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ఇప్పుడు జేడీయూ పార్టీ నుంచి గట్టిగా వినిపిస్తోంది. పలువురు నాయకులు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. బాబాయ్ సతీష్ కుమార్ సైతం బిహార్ కొత్త సీఎంగా నిశాంత్ కుమార్ సమర్థుడని, ఆయనకు బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. ఇటీవల నిశాంత్ తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు, అక్కడి ప్రజలు కూడా నితీష్ కుమార్ తర్వాత ఆయనే రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా డిమాండ్ చేశారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
Railway Travel Insurance: 45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?
45 పైసలకే రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా సాధ్యం?.. రైల్వే, బీమా కంపెనీలకు నష్టం రాదా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget