BrahMos Supersonic Cruise Missile : బ్రహ్మోస్ న్యూ ఎయిర్ లాంచ్ వెర్షన్ - 800 కి.మీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం!
BrahMos Supersonic Cruise Missile : బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి న్యూ వెర్షన్ 800 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదని అధికార వర్గాలు చెబుతున్నాయి. బ్రహ్మోస్ అప్డేట్ వెర్షన్ తో లక్ష్య పరిధి పెరిగిందని ఎయిర్ పోర్స్ వర్గాలు అంటున్నారు.
BrahMos Supersonic Cruise Missile : 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎయిర్-లాంచ్డ్ వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఇంతకుముందు ఈ క్షిపణి Su-30MKI యుద్ధ విమానం నుంచి ప్రయోగించినప్పుడు దాదాపు 300 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించింది. "బ్రహ్మోస్ క్షిపణి పరిధి ఇప్పటికే పెరిగింది. బ్రహ్మోస్ క్షిపణి ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ ఎక్కువ దూరం ప్రయాణించగలదు. 800 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలదు" అని ఎయిర్ పోర్స్ వర్గాలు ANIకి తెలిపాయి.
సాంకేతిక లోపంతో పాకిస్థాన్ లో పడిన క్షిపణి
కమాండ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ (CASI) సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ నుంచి సాంకేతిక లోపం కారణంగా బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్ అయిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో ల్యాండ్ అయింది. అక్కడ తక్కువ స్థాయిలోనే ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టమేం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పాక్ అధికారులకు లేఖ పంపింది. ఈ ఘటనపై అధికారిక ప్రకటన కూడా చేసింది.
New air-launched version of BrahMos supersonic cruise missile would be able to strike targets at 800 kms: Sources
— ANI Digital (@ani_digital) March 13, 2022
Read @ANI Story | https://t.co/SsUsTRW95x#BrahMos #BrahmosMissile pic.twitter.com/DOtG3jjvin
పాకిస్థాన్ వక్ర బుద్ధి
బ్రహ్మోస్ మిస్ ఫైరింగ్ విషయాన్ని పెద్దది చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ క్షిపణి ప్రయోగాలపై ప్రశ్నించడానికి ప్రయత్నిస్తోంది. అయితే బ్రహ్మోస్ కేవలం వ్యూహాత్మక క్షిపణి అని ఎయిర్ పోర్స్ వర్గాలు తెలిపాయి. భారతదేశం ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచింది. దాని సాఫ్ట్‌వేర్‌లో అప్‌గ్రేడ్‌తో 500 కిలోమీటర్లు దాటి ప్రయాణించగలదు. శత్రు శిబిరాల్లో భారీ విధ్వంసం సృష్టించగల బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను భారత వైమానిక దళం దాదాపు 40 Su-30 యుద్ధ విమానాలలో అమర్చింది. భారత వైమానిక దళం (IAF) ఈ విమానాలను చైనాతో వివాదాలు కొనసాగుతున్న సమయంలో తంజావూరు నుంచి ఉత్తర సెక్టార్‌కు తరలించింది. IAF ఈ క్షిపణులతో శత్రు స్థావరాలపై పిన్-పాయింట్ దాడి చేయగలదు.