![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NCB Biggest Drug Seizure: అతి భారీ స్థాయిలో 15 వేల ఎల్ఎస్‌డీ బ్లాట్స్ పట్టివేత- క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్ ద్వారా లావాదేవీ
NCB Biggest Drug Seizure: భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఎన్సీబీ అధికారులు ఛేదించారు. సుమారు రూ.25 వేల కోట్ల విలువైన ఎల్ఎస్‌డీ బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
![NCB Biggest Drug Seizure: అతి భారీ స్థాయిలో 15 వేల ఎల్ఎస్‌డీ బ్లాట్స్ పట్టివేత- క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్ ద్వారా లావాదేవీ NCB busts pan-India drug network 2 Decades Over 15000 Blots Of LSD Through Dark Net Cryptocurrency NCB Biggest Drug Seizure: అతి భారీ స్థాయిలో 15 వేల ఎల్ఎస్‌డీ బ్లాట్స్ పట్టివేత- క్రిప్టోకరెన్సీ, డార్క్ వెబ్ ద్వారా లావాదేవీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/06/53a889863d546047266a8573b800b5991686051155620754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NCB Biggest Drug Seizure: దేశవ్యాప్తగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ భారీ నెట్‌వర్క్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు ఛేదించారు. 15 వేల ఎల్ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఒకే ఆపరేషన్ లో ఈ స్థాయిలో ఎల్ఎస్‌డీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి రెండు కేసుల్లో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు.
దేశ, విదేశాల్లో విస్తరించి ఉన్న భారీ నెట్‌వర్క్
ఈ భారీ నెట్ వర్క్ దేశ, విదేశాల్లో విస్తరించి ఉందని, పోలాండ్, నెదర్లాండ్స్, అమెరికాల నుంచి ఎల్‌ఎస్‌డీ ని అక్రమంగా దిగుమతి చేసుకుని.. ఢిల్లీ - ఎస్ఈఆర్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నార్త్ డిపార్ట్‌మెంట్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ఈ డ్రగ్స్ కు చెల్లింపుల కోసం డార్క్ నెట్‌లో క్రిప్టో కరెన్సీలను ఉపయోగించినట్లు గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 4.60 లక్షల విలువైన 2.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
0.1 గ్రాముల్లో ఎల్‌ఎస్‌డీ లావాదేవీలు
ఎల్ఎస్‌డీ(లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్).. అనేది సింథటిక్ రసాయన ఆధారిత డ్రగ్. ఇది హాలూసినోజెన్‌గా వర్గీకరిస్తారు. ఎల్‌ఎస్‌డీ ని యువత ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ ఎల్‌ఎస్‌డీ ని 0.1 గ్రాముల పరిమాణంలోనూ అమ్మకాలు జరుపుతారని, ఆ మొత్తంలోని ఎల్‌ఎస్‌డీ కలిగి ఉన్నా.. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు అవుతుందని వెల్లడించారు. తాజాగా పట్టుడిన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్ లు.. దాని వాణిజ్య పరిమాణం కంటే 2.500 రెట్లు ఎక్కువ అని తెలిపారు. ఒక బ్లాట్.. ఒక చిన్న పేపర్ ముక్క పరిమాణంలో ఉంటుందని చెప్పారు.
ఎల్‌ఎస్‌డీపై డార్క్ వెబ్‌లో ప్రకటనలు
ఈ భారీ నెట్‌వర్క్ సూత్రధారిని జైపూర్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్‌ఎస్‌డీ ని అక్రమంగా సరఫరా చేసే వారు డార్క్ వెబ్‌లో ప్రకటనలు ఇస్తున్నట్లు దర్యాప్తు సమయంలో అధికారులు గుర్తించారు. పొటెన్షియల్ బయ్యర్లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత వారితో సంప్రదింపులు జరిపి అనంతరం డార్క్ వెబ్ ద్వారా ఎల్ఎస్‌డీ అమ్మకాలు జరుపుతారని అధికారులు తెలిపారు.
ఎల్‌ఎస్‌డీ బ్లాట్ అంటే ఏంటి?
బ్లాట్ అనేది స్టాంప్ పేపర్ రూపంలో ఉంటుంది. ఒక స్టాంపులో చిన్న చిన్న బ్లాట్‌లు చాలా ఉంటాయి. 0.1 గ్రాముల పరిమాణంలో ఎల్‌ఎస్‌డీని ఈ కాగితాల్లో నిక్షిప్తం చేసి వాటిని స్టాంపుల రూపంలో తయారు చేస్తారు. చిన్న సైజు స్టాంప్ పేపర్ల రూపంలో ఉండే ఈ బ్లాట్లను డ్రగ్స్ వినియోగదారులు నోట్లో వేసుకుని మింగేస్తుంటారు. లోపలికి వెళ్లిన తర్వాత బ్లాట్లలో నిక్షిప్తం చేసిన డ్రగ్ కరిగి దాని ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. సాధారణ డ్రగ్స్ కంటే కూడా ఇలా బ్లాట్స్ సరఫరా చేయడం చాలా తేలిక. ఓ చిన్న సైజు పేపర్ ముక్కను ఎలాగైనా దాచుకుని సరఫరా చేయవచ్చు. అందుకే ఈ పద్ధతిలో ఎల్‌ఎస్‌డీని అక్రమంగా సరఫరా చేస్తుంటారు.
It was a huge network and was spread across Poland, Netherlands, USA, Delhi-NCR, Rajasthan, Maharashtra, Kerala, Tamil Nadu and Uttar Pradesh. They used cryptocurrency and darknet. 2.5 kg marijuana, Rs 4.65 lakh and 20 lakhs deposited in bank accounts were seized: Gyaneshwar… pic.twitter.com/J1HJhHsFrV
— ANI (@ANI) June 6, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)