అన్వేషించండి

ఘనంగా ముగిసిన మైసూరు దసరా వేడుకలు, హైలైట్‌గా నిలిచిన జంబో సవారీ

Mysuru Dasara celebrations: జంబో సవారీతో మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

Mysuru Dasara celebrations: 


దసరా వేడుకలు ముగింపు..

మైసూరులో దసరా వేడుకలు ( Mysuru Dasara celebrations 2023) ఘనంగా ముగిశాయి. ఏనుగుల మార్చ్‌తో ఉత్సవాల్ని ముగించారు. దీన్నే జంబో సవారీ ( Mysuru Jumbo Savari) అంటారు.  ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది తరలి వచ్చారు. ఈ సవారీని అభిమన్యు అనే ఓ ఏనుగు (Abhimanyu Elephant) ముందుండి నడిపించింది. ఈ ఏనుగుపైనే దాదాపు 750 కిలోల బరువున్న చాముండేశ్వరి దేవి బంగారు పల్లకిని ఊరేగించారు. మైసూర్ ప్యాలెస్‌ ప్రాంగణం నుంచి బన్నిమంటపం వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. అభిమన్యు ఏనుగుపై ఇలా అమ్మవారిని ఊరేగించడం వరుసగా నాలుగోసారి. ఈ ఏనుగుతో పాటు ఈ ర్యాలీలో మహేంద్ర, గోపి, రోహిత్, లక్ష్మి, విజయ, వరలక్ష్మి తదితర ఏనుగులూ పాల్గొన్నాయి. ఈ ఏనుగులన్నింటినీ అందమైన పెయింట్‌లతో అలంకరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జంబో సవారీని ప్రారంభించారు. ఈ సవారిని గౌరవ వందనంతో మొదలు పెట్టారు. కోటె ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన సిద్దరామయ్య అక్కడ పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. మైసూరు దసరా ఉత్సవాల్లో జంబో సవారీయే ప్రధాన ఆకర్షణ. రకరకాల ఎలిఫెంట్ క్యాంప్‌ల నుంచి ఏనుగుల్ని తీసుకొచ్చి ఈ వేడుకలకు సిద్ధం చేస్తారు. అందంగా తీర్చి దిద్దుతారు. ఈ వేడుకల్ని చూసేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. 

400 ఏళ్ల చరిత్ర..

కేఆర్ సర్కిల్ మీదుగా ఈ సవారీ కొనసాగింది. ఈ ఉత్సవాల్లో కర్ణాటకలోని అన్ని రకాల సంస్కృతుల్నీ ప్రదర్శిస్తారు. బీదర్, కలబుర్గి, మాండ్యా, రామ్‌నగర్, హసన్, గడగ్, ధార్వాడ్, యాద్గిర్, చిక్కమంగళూరు, కోలార్, బల్లారి, బెలగావి సంస్కృతులను ప్రదర్శనకు ఉంచారు. అక్టోబర్ 15న చాముండి హిల్స్ వద్ద మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ కన్నడ గేయ రచయిత హంసలేఖ ఈ వేడుకల్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. మైసూరు రాజులు ఉన్నప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. చాలా ఏళ్లుగా ప్రభుత్వమే అధికారికంగా ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తోంది. స్థానికంగా వీటిని Nadda Habba గా పిలుచుకుంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget