Navaneet Kaur : నవనీత్ కౌర్ దంపతులకు మరో షాక్ - ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు !
ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు శివసేన సర్కార్ మరో షాకిచ్చేందుకు రెడీ అయింది. ముంబైలోని వారి ఇల్లు అక్రమ కట్టడం అని నోటీసులు జారీ చేసింది.
హనుమాన్ చాలీసా వివాదంతో జైలు పాలైన మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, రవి రాణాలకు శివసేన సర్కార్ మరో షాక్ ఇచ్చింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రవి రాణా, నవనీత్ కౌర్‌లో ముంబైలో కట్టిన ఇల్లు అక్రమం అని.. తక్షణం సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని నోటీసులు జారీ చేశారు. ముంబైలోని ఖర్ ప్రాంతంలో వారి ఇల్లు ఉంది. వారిద్దరూ జైల్లో ఉండాగనే ఖర్ లోని వారి నివాసాన్ని ముంబై అధికారులు తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. శివసేన సర్కార్‌తో గొడవ పడిన హీరోయిన కంగనా రనౌత్‌కు కార్యాలయాన్ని కూడా గతంలో కూల్చివేశారు.
బుల్‌బుల్ సాహాతో మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ పెళ్లి - నెటిజన్ల హడావుడి ఎలా ఉందో తెలుసా ?
వారం కిందట అరెస్టయినఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాల బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టు తీర్పును వెలువరించకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు. వారి బెయిల్ పిటిషన్ పై సోమవారం కోర్టును తీర్పును వెలువరించాల్సింది. అయితే సోమవారం లేట్ కావడంతో తీర్పు వెలువరించలేకపోయారు. మంగళవారం రంజాన్ సందర్భంగా కోర్టుకు సెలవు. అందుకే వీరి బెయిల్ పిటిషన్ పై తీర్పు బుధవారానికి వాయిదా పడింది.
కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు! అమిత్ షా పర్యటన వేళ గుసగుసలు!
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామంటూ ఈ దంపతులు చేసిన బహిరంగ హెచ్చరిక వీరి అరెస్టుకు కారణం అయ్యింది. వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా.. వారి ఇంటి ముందు కావాలని మత సంబంధ కార్యక్రమాలను నిర్వహించడం నేరమని పోలీసులు కేసులు పెట్టారు. మతఘర్షణలు రేకెత్తించేలా ముఖ్యమంత్రి ఇంటి ముందు ఇలాంటి రాజకీయం చేస్తామని వీరు బహిరంగంగా హెచ్చరించడం శాంతిభద్రతల విఘాతానికి చేసిన కుట్రగా పోలీసులు తేల్చారు. కోర్టు కూడా వీరి అరెస్టును ఇప్పటి వరకూ తప్పు పట్టలేదు. బెయిల్ పిటిషన్ దాఖలైనప్పటికీ.. తీర్పు వాయిదా పడింది. ఈ దంపతులను వేర్వేరు జైళ్లకు తరలించాలని ఇది వరకే బాంబే కోర్టు తీర్పును ఇచ్చింది.
ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా!
రాజకీయంగా బీజేపీ మద్దతుతో శివసేన సర్కార్‌ను ఇలా టార్గెట్ చేస్తున్నారని నవనీత్ కౌర్, రవి రాణా దంపతులపై శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ దంపతులు విడుదలైన తర్వాత ఎలాంటి రాజకీయం చేస్తారోనని మహారాష్ట్ర వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.