Bairabi–Sairang Railway Line: కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ -మిజోరంలో రైల్వే అద్భుతం
Bairabi–Sairang Railway Line: కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ -మిజోరం లో రైల్వే అద్భుతం ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు.

Bairabi–Sairang Railway Line: భారత ఈశాన్య రాష్ట్రం మిజోరంలో రైల్వే శాఖ అద్భుతాన్ని సృష్టించింది. కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని (114మీ) నిర్మించింది. మిజోరం రాజధాని ఐజ్వాల్ ను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే భైరాబీ -సైరాంగ్ (Bairabi - sairang ) రైల్వే లైన్ (51.38km) రైల్వే ప్రాజెక్ట్ను పూర్తి చేసిన రైల్వే కొండలు లోయలతో నిండిన అతి ప్రాంతంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది
8 వేల కోట్లు - 11 సంవత్సరాలు
స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ రైలు సౌకర్యం లేదు. ఎత్తైన కొండలు లోయలతో పాటు దట్టమైన అడవులతో నిండి ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్ నిర్మాణం అంత సులభం కాదు. గత కొన్నేళ్లుగా ఈశాన్య రాష్ట్రాలు కూడా ట్రైన్ సౌకర్యం కల్పించడం కోసం రకరకాల ప్రాజెక్టులు చేపట్టింది రైల్వే. అందులో ముఖ్యమైనది భారతదేశపు చిట్టచివరి సరిహద్దు అయిన మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ ను రైల్వే ద్వారా మిగిలిన ప్రాంతాలకు కనెక్ట్ చేసే ప్రాజెక్ట్. దీని కోసం 2008-09 లో 8071కోట్ల రూపాయలను కేటాయించారు. అప్పటి నుంచి అత్యంత కష్టమైన ఈ రైల్వే నిర్మాణం కోసం 11 సంవత్సరాల సమయం పట్టింది. ఆల్రెడీ అస్సాం లోని సిల్చర్, గౌహతి లాంటి ప్రాంతాల నుంచి మిజోరం లోని బైరాబీ వరకూ రైలు మార్గం ఉంది. ఇప్పుడు బైరాబీని ఐజ్వాల్ లోని సైరాంగ్ తో కనెక్ట్ చేశారు. 51.38 కిమీ పొడవైన ఈ బ్రాడ్ గేజ్ ట్రాక్ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అంటుంది దీన్ని నిర్మించిన Railway)ఈస్ట్రన్ ఫ్రాంటియర్ రైల్వే ( Northeast Frontier Railway ).
48 టనెల్స్ - 142 బ్రిడ్జ్ లు
ఈ 51 కిమీ పొడవైన రైలు మార్గంలో 142 బ్రిడ్జ్ లు ఉన్నాయి. వీటిలో 55 పెద్దవి కాగా 87 చిన్నవి. ఇవి కాకుండా బాగా చిన్న బ్రిడ్జ్ లు కొన్ని ఉన్నాయి. అలాగే కొండల్ని తొలచి 48 టన్నెల్స్ నిర్మించారు.
కుతుబ్ మీనార్ కంటే ఎత్తయిన బ్రిడ్జ్
ఈ రైల్వే మార్గంలో బ్రిడ్జ్ నెంబర్ 144 చాలా ప్రత్యేకమైనది. దీని ఎత్తు 114మీ. అంటే ఢిల్లీలోని కుతుబ్ మీనార్ (72మీ) కంటే 42 మీ ఎక్కువ పొడవైంది.
టూరిజం, వాణిజ్యాలకు ఊతం
అత్యంత కష్టసాధ్యమైన ఈ భైరాబీ-సైరాంగ్ రైల్వే లైన్ నిర్మాణంతో మారుమూల ప్రాంతమైన మిజోరంలో విద్యార్థులు చదువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం ఈజీ అవుతోంది. అలాగే కొండల నడుమ వ్యాపారం కోసం ఇతర వాహనాలపై ఆధారపడాల్సిన కష్టం అక్కడి ప్రజలకు తప్పుతుంది. పైగా లారీలతో పోలిస్తే ట్రైన్ రవాణా చవక.
Act East లో భాగం గా భైరబీ-సైరాంగ్ రైల్వే లైన్
దక్షిణాసియాలోని అన్ని ప్రాంతాలను రైలు రోడ్డు మార్గాల ద్వారా కనెక్ట్ చేయడం కోసం Act East అనే పాలసీని రూపొందించాయి ఆసియా దేశాలు. అందులో భాగంగా భారతదేశం చేపట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఈ మిజోరం రైలు ప్రాజెక్ట్ ఒకటి. త్వరలోనే దీన్ని సరిహద్దు దేశమైన బర్మాకు కనెక్ట్ చేసే ఆలోచన లో ఉన్నారు. ప్రస్తుతానికి రెడీ అయిన బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్ ను ప్రధాని మోదీ అతి త్వరలో ప్రారంభించనున్నారు.





















