Meta India : కేంద్ర మంత్రికి క్షమాపణలు చెప్పిన మెటా ఇండియా.. ఎందుకంటే ?
Ashwini Vaishnaw :సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మాతృ సంస్థ మెటా బుధవారం పాడ్‌కాస్ట్ సందర్భంగా భారతదేశ ఎన్నికలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది.
Mark Zuckerberg:సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మాతృ సంస్థ మెటా బుధవారం పాడ్‌కాస్ట్ సందర్భంగా భారతదేశ ఎన్నికలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచించనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. కరోనా మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని జుకర్‌బర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో నోరు జారారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. మార్క్ జూకర్‌బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని తెలిపారు. జూకర్‌బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.మెటా ఇండియా దీనిని అనుకోకుండా జరిగిన పొరపాటు అని పేర్కొంది. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా క్షమాపణలు చెప్పి తన అభిప్రాయాలను వివరించారని పీటీఐ పేర్కొంది.
క్షమాపణలు చెప్పిన మెటా ఇండియా
మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటనకు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ ఎక్స్ లో చేసిన పోస్టులో ఇలా రాశారు.. ‘‘2024 ఎన్నికలలో అనేక అధికార పార్టీలు తిరిగి ఎన్నిక కావు అనే మార్క్ జుకర్‌బర్గ్ పరిశీలన చాలా దేశాలకు వర్తిస్తుంది కానీ భారతదేశానికి కాదు. ఈ అనుకోకుండా జరిగిన పొరపాటుకు మేము క్షమాపణలు కోరుతున్నాము. భారతదేశం మెటాకు చాలా ముఖ్యమైన దేశంగా మిగిలిపోయింది. దాని వినూత్న భవిష్యత్తుకు కేంద్రంగా ఉండాలని మేము ఎదురుచూస్తున్నాము.’’ అని అన్నారు.
Also Read :German Companies : అబద్ధాలు చెప్పి లీవ్ తీసుకుంటున్నారా? - అయితే మీకో అలర్ట్, వీరు మిమ్మల్ని పట్టిస్తారు!
అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విని వైష్ణవ్
భారత ప్రభుత్వం గురించి తప్పుడు వాదనలపై మార్క్ జుకర్‌బర్గ్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రంగా విమర్శించారు. ఆయన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నిరాశపరిచిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 2024 ఎన్నికల్లో 64 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన్నారని కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏపై భారత ప్రజలు మరోసారి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత 2024 ఎన్నికలలో భారతదేశంతో సహా చాలా అధికార ప్రభుత్వాలు ఓడిపోయాయనే జుకర్‌బర్గ్ వాదన తప్పని అశ్విని వైష్ణవ్ అన్నారు.
మెటా ఇండియా క్షమాపణపై నిషికాంత్ దూబే స్పందన
మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యకు మెటా ఇండియా క్షమాపణలు చెప్పడంపై.. ఇది భారత ప్రజల విజయమని బిజెపి ఎంపీ అన్నారు. మెటా చేసిన ఈ క్షమాపణ భారత పార్లమెంటు, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సమన్లు జారీ చేయబడతాయని ఐటీ పార్లమెంటరీ ప్యానెల్ అధిపతి నిషికాంత్ దూబే హెచ్చరించారు.
Also Read :Flying Cars : 2026 నాటికి ఎగిరే కార్లు సిద్ధం - వీటి ధరెంత? స్పెసిఫికేషన్స్ ఇవే..!