Mann Ki Baat Highlights:పెళ్లి చేసుకోడానికి విదేశాల వరకూ వెళ్లడం అవసరమా - కొత్త ట్రెండ్‌పై ప్రధాని మోదీ అసంతృప్తి
Mann Ki Baat: మన్‌కీ బాత్ కార్యక్రమంలో అబ్రాడ్ వెడ్డింగ్స్‌పై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Weddings Abroad:
విదేశాల్లో వివాహాలపై మోదీ కామెంట్స్..
సొసైటీలో పలుకుబడి ఉన్న కుటంబాల్లోని వ్యక్తులు విదేశాల్లో వివాహాలు (Abroad Weddings) చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ట్రెండ్ గురించి ప్రస్తావించారు. భారత్‌లోనే వివాహ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. భారత్‌లో సంపాదించుకున్న డబ్బుల్ని ఇక్కడే ఖర్చు పెడితే మార్కెట్‌కి మంచిదని, విదేశాల్లో వాటిని ఖర్చు చేయకూడదని పిలుపునిచ్చారు. వివాహ వేడుకల షాపింగ్ చేసే సమయంలోనూ మేడిన్ ఇండియా ప్రొడక్ట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఇప్పుడిప్పుడే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోందని, ఇది మార్కెట్‌కి ఎంతగానో ఉపకరిస్తుందని వెల్లడించారు.
"భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సీజన్ వల్ల చాలా వరకూ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం రూ.5 లక్షల కోట్ల బిజినెస్ జరగనుంది. పెళ్లిళ్లకు షాపింగ్ చేసే వాళ్లంతా భారత్‌లో తయారైన వస్తువులకే ప్రాధాన్యతనివ్వండి. వాటినే కొనుగోలు చేయండి"
- ప్రధాని నరేంద్ర మోదీ
భారత్‌లోనే చేసుకోవాలని సూచన..
భారతీయులు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తాను అసంతృప్తికి లోనవుతానని చెప్పారు ప్రధాని మోదీ. ఇది అంత అవసరం లేదేమో అని అన్నారు.
"పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నాకో విషయంలో అసంతృప్తి కలుగుతుంది. ఇప్పటికైనా నా మనసులోని బాధను చెప్పకపోతే ఎలా..? అందుకే చెప్పేస్తున్నాను. కొంత మంది సంపన్నుల కుటుంబాలు తమ పిల్లలకు విదేశాల్లో పెళ్లిళ్లు చేయడానికే ఇష్టపడుతున్నాయి. ఇదో ట్రెండ్ అయింది. ఇది అంత అవసరమా..? పెళ్లి వేడుకలు భారత్‌లోనే చేసుకుంటే ఇక్కడి వ్యాపారానికి ఊతం ఇచ్చినట్టు ఉంటుంది. మన దేశానికి చెందిన డబ్బులు మన దగ్గరే ఖర్చవుతాయి. అవి విదేశాల్లో వృథా కావు. పెళ్లిళ్లలోనూ వోకల్ ఫర్ లోకల్ ట్రెండ్ ఉంటే బాగుంటుంది. అందరూ ఇది అనుసరిస్తే ఇదే ట్రెండ్ అవుతుంది. సంపన్నుల కుటుంబాలు ఓ సారి దీనిపై ఆలోచించాలి"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Kerala Stampade: కొచ్చి వర్సిటీలో తొక్కిసలాటకు కారణాలివే, కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply