Manipur Violence: మణిపూర్‌లో ఆర్మీని చుట్టుముట్టిన 12 వందల మంది, మిలిటెంట్స్ విడుదల
Manipur Violence: మణిపూర్‌లో ఇండియన్ ఆర్మీని 12 వందల మంది ఆందోళనకారులు చుట్టుముట్టారు.
Manipur Violence:
మిలిటెంట్స్‌ని రిలీజ్ చేయాలని డిమాండ్..
మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన 12 మంది మిలిటెంట్స్‌ని అరెస్ట్ చేసింది ఆర్మీ. వాళ్లను విడుదల చేయాలంటూ నిరసనకారులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇథామ్ గ్రామంలో ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీని 12 వందల మంది చుట్టుముట్టారు. అరెస్ట్ చేసిన 12 మంది మిలిటెంట్స్‌ని విడుదల చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మహిళల నేతృత్వంలో వందలాది మంది చుట్టుముట్టడం వల్ల ఆర్మీ ఏమీ చేయలేకపోయింది. పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడం ఎందుకని ఆలోచించి ఆ 12 మందిని విడుదల చేసింది. వాళ్లను విడుదల చేస్తేనే ఎంతో కొంత ఆందోళనలు తగ్గుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
"మహిళలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వాళ్లపై మా ఫోర్స్‌ని వాడే విషయంలో చాలా ఆలోచించాం. ఒకవేళ మేం యాక్షన్ తీసుకున్నా చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఇది ముందుగా ఆలోచించే...వాళ్లు డిమాండ్ చేసినట్టుగా 12 మంది మిలిటెంట్స్‌ని విడుదల చేశాం. కమాండర్ తీసుకున్న నిర్ణయం మంచిదనే భావిస్తున్నాం. ఇండియన్ ఆర్మీ మానవతా దృక్పథానికి ఇది నిదర్శనం"
- ఇండియన్ ఆర్మీ
Unedited UAV Footage@adgpi @easterncomd #Manipur pic.twitter.com/mfVWK0CHKt
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 24, 2023
అరెస్టైన మరుసటి రోజే విడుదల..
Kanglei Yawol Kanna Lup (KYKL) గ్రూప్‌కి చెందిన మితేయ్ మిలిటెంట్స్‌ని అరెస్ట్ చేసింది ఆర్మీ. చాలా రోజులుగా స్థానికంగా దాడులను ప్రేరేపిస్తున్నారు ఈ ఉగ్రవాదులు. వీళ్లను అదుపులోకి తీసుకున్న తరవాత పరిస్థితులు నార్మల్ అవుతాయని భావించారు. కానీ...ఉన్నట్టుండి అంత మంది వచ్చి చుట్టుముట్టే సరికి అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే విడుదల చేయాల్సి వచ్చింది.
𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗶𝗻 𝗜𝘁𝗵𝗮𝗺 𝗩𝗶𝗹𝗹𝗮𝗴𝗲 𝗶𝗻 𝗜𝗺𝗽𝗵𝗮𝗹 𝗘𝗮𝘀𝘁 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 24, 2023
Acting on specific intelligence, operation was launched in Village Itham (06 km East of Andro) in Imphal East by Security Forces today morning. Specific search after laying cordon was… pic.twitter.com/7ZH9Jp8nOI
మణిపూర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆల్ పార్టీ మీటింగ్‌కి (All Party Meeting) పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి NCP చీఫ్ శరద్ పవార్ హాజరు కాలేదు. అయితే...ఆ పార్టీ తరపున జనరల్ సెక్రటరీ నరేంద్ర వర్మ, మణిపూర్ ఎన్సీపీ చీఫ్ సోరన్ ఇబోయమా సింగ్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా, ఆప్ లీడ్ సంజయ్ సింగ్ ఈ మీటింగ్‌కి వచ్చారు. ఇప్పటికీ మణిపూర్‌లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వరుసగా దాడులు చేస్తున్నారు ఆందోళనకారులు. మంత్రి సుసింద్రోకి చెందిన ఓ ప్రైవేట్ గోడౌన్‌కి నిప్పంటించారు. ఫలితంగా ఇంఫాల్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. మరో మంత్రి ప్రాపర్టీకి కూడా నిప్పంటించేందుకు ప్రయత్నించారు. అయితే...అప్పటికే భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నాయి.
Also Read: ఏకంగా మహిళా ప్రొఫెసర్‌నే వేధించిన స్టూడెంట్, ఆమె ఫోన్‌కు న్యూడ్ వీడియోలు!