News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఏకంగా మహిళా ప్రొఫెసర్‌నే వేధించిన స్టూడెంట్, ఆమె ఫోన్‌కు న్యూడ్ వీడియోలు!

మహిళా ప్రొఫెసర్ కు న్యూడ్ వీడియోలు పంపుతూ.. వేధింపులకు పాల్పడుతున్నాడో విద్యార్థి. వాటిని ఆమె భర్తకు పంపి డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నాడు.  

FOLLOW US: 
Share:

ఇన్ స్టాలో ఓ మహిళా ప్రొఫెసర్ తో చాట్ చేసేవాడు ఓ విద్యార్థి. అలా ఏర్పడిన పరిచయంతో నేరుగా ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే అతను తాను పని చేసే చోటే విద్యార్థి అని తెలుసుకున్న ప్రొఫెసర్ దూరం పెట్టాలనుకుంది. కానీ అంతలోనే విద్యార్థి వీడియో కాల్ చేసి తాను చెప్పినట్లు చేయకపోతే.. తమ చాటింగ్ ను కళాశాలలో అందరికీ చూపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ప్రొఫెసర్ న్యూడ్ వీడియో పంపగా.. విద్యార్థి ఆ వీడియోను మహిళా ప్రొఫెసర్ భర్తకు పంపించాడు. 4 లక్షల ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 

అసలేం జరిగిందంటే...?

బిహార్ కు చెందిన 26 ఏళ్ల మయాంక్ సింగ్ మహారాష్ర్టలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే ఇతడు ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఓ మహిళా ప్రొఫెసర్ తో చాటింగ్ చేసేవాడు. ఆమె కూడా ఇతడితో బాగానే మాట్లాడేది. ఆ తర్వాత చాటింగ్ వదిలి ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ చేసుకునే స్థాయికి వచ్చారు. కానీ అతను తాను పనిచేసే చోట చదువుకునే విద్యార్థిని అని తెలుసుకొని దూరం పెట్టాలనుకుంది. కానీ మయాంక్ సింగ్ అంతలోపే ఫోన్ చేసి తాను చెప్పినట్లు చేయాలని బెదిరించాడు. అలా చేయకపోతే తమ మధ్య జరిగిన సంభాషణలను యూనివర్సిటీలో బయట పెడతానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన మహిళా ప్రొఫెసర్.. నిందితుడు చెప్పినట్లు నగ్నంగా మారింది. ఆ దృశ్యాలను రికార్డ్ చేసిన మయాంక్ సింగ్.. బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇదే విషయాన్నిఆమె తన భర్తకు చెప్పింది. అలాగే మయాంక్ సింగ్ కూడా ఆమె భర్తకు.. మహిళా ప్రొఫెసర్ నగ్న వీడియోలు పంపి.. నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే ఏమాత్ర బెదరని దంపతులు.. పోలీసులను ఆశ్రయించారు. అసలు విషయం చెప్పి తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారికి గతేడాది ఆగస్టు 8వ తేదీన.. మోర్బికి చెందిన రియా శర్మ పేరిట ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది చూసిన వ్యాపారి కూడా ఆమెతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే సదరు యువతి నగ్నంగా ఉండి వీడియో కాల్ చేసింది. కవ్వించేలా మాట్లాడుతూ.. అతడికి మత్తెక్కించింది. అలా తీవ్ర కామోద్రేకానికి గురైన అతడు కూడా... బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఆమెతో ఫోన్ మాట్లాడాడు. అప్పడే ఆ యువతి.. అతడు నగ్నంగా ఉన్న వీడియోను రికార్డు చేసింది. ఆపై డబ్బులు పంపించకుంటే ఆ వీడియోను బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. వీడియో బయటకు వస్తే తన పరువు పోతుందని భావించిన అతడు.. సదరు యువతికి రూ.50 వేలు పంపించాడు. ఆ తర్వాత మరికొన్ని రోజులకే మరో యువకుడు ఫోన్ చేసి.. తాను దిల్లీకి చెందిన ఇన్ స్పెక్టర్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. వీడియో క్లిప్ తన వద్ద ఉందని చెప్పి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని.. లేని పక్షంలో కేసు బుక్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన వ్యాపారి అతడికి 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆగస్టు 14వ తేదీన మరో వ్యక్తి పోన్ చేసి.. దిల్లీ పోలీస్ సైబర్ సెల్ సిబ్బందిని అని చెప్తూ... రియా శర్మ ఆత్మహత్యకు యత్నించిందని, ఆ వీడియో కాల్ యే అందుకు కారణం అని చెప్పాడు. ఆ విషయం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు కావాలని పలు దపాలుగా రూ.80.97 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి సీబీఐ అధికారిని అంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు. అలా లక్షల్లో దోచేయగా.. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.

Published at : 25 Jun 2023 10:14 AM (IST) Tags: Latest Crime News nude videos Maharashtra News Lady Professor Harassing a Female Professor

ఇవి కూడా చూడండి

Look Back 2023 New Parliament Building :  ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా  - 2023లోనే అందుబాటులోకి  కొత్త పార్లమెంట్ భవనం !

Look Back 2023 New Parliament Building : ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా - 2023లోనే అందుబాటులోకి కొత్త పార్లమెంట్ భవనం !

Modi Popularity: ప్రపంచంలోనే పాపులర్ లీడర్‌గా ప్రధాని మోదీ,ఏం క్రేజ్ బాసూ -ఎక్కడా తగ్గట్లే!

Modi Popularity: ప్రపంచంలోనే పాపులర్ లీడర్‌గా ప్రధాని మోదీ,ఏం క్రేజ్ బాసూ -ఎక్కడా తగ్గట్లే!

Look Back 2023 Womens Reservation Act : సమానత్వం వైపు మరో అడుగు మహిళా రిజర్వేషన్ల చట్టం - 2023లో సాకారం !

Look Back 2023 Womens Reservation Act :  సమానత్వం వైపు మరో అడుగు మహిళా రిజర్వేషన్ల చట్టం - 2023లో సాకారం !

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

Aditya-L1 Mission: ఇస్రో మరో ఘనత, సూర్యుడి ఫొటోలు తీసిన ఆదిత్య L1

Aditya-L1 Mission: ఇస్రో మరో ఘనత, సూర్యుడి ఫొటోలు తీసిన ఆదిత్య L1

టాప్ స్టోరీస్

Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌

Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!

Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!