Manipur Violence: మొత్తానికి మణిపూర్ హింసపై మోదీ నోరు విప్పారు, అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు
Manipur Violence: మణిపూర్ అల్లర్లపై కనీసం ఇప్పటికైనా ప్రధాని మోదీ మాట్లాడారంటూ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు.
Manipur Violence:
తీవ్రంగా స్పందించిన మోదీ..
మణిపూర్ హింసపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. నిందితులను ఉపేక్షించమని తేల్చి చెప్పారు. అయితే..దాదాపు రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా ప్రధాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు. కనీసం రెండు నెలల తరవాతైనా మాట్లాడారని సెటైర్లు వేశారు. ఆ వైరల్ వీడియో చూసిన తరవాతే ప్రధాని మోదీ చలించిపోయారా..? అంటూ ప్రశ్నించారు. ఈ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు బీజేపీ ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రజలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని మండి పడ్డారు.
"మొత్తానికి రెండు నెలల తరవాత ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ అల్లర్లపై నోరు విప్పారు. ఇన్ని రోజులుగా కుకీ తెగకు చెందిన ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మహిళను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయ్యేంత వరకూ ప్రధాని ఎందుకు స్పందించలేదు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి 160 మంది మరణాలను ఎలా జస్టిఫై చేసుకుంటారు. ఎంతో మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 50 వేల మంది రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు"
- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్
The PM @PMOIndia at last spoke on Manipur after 2 Months of continuing Genocide of Kuki tribes,question that the Govt must answer but for the horrible video will Modi have reacted?
— Asaduddin Owaisi (@asadowaisi) July 20, 2023
Will BJP CM of Manipur give justice to the 160 killed,many women who have been raped ,fifty…
మోదీ తీవ్ర అసహనం...
మణిపూర్‌లో అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన హింసాత్మక ఘటనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మహిళను నగ్నంగా రోడ్లపై తిప్పిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చాలా ఆవేశంగా మాట్లాడారు మోదీ. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. మణిపూర్‌లో జరిగిన దారుణం...మొత్తం దేశానికే కళంకం అని అన్నారు.
"మణిపూర్‌లో జరిగిన ఘటన దేశంలోని 140 కోట్ల ప్రజలందరికీ సిగ్గుచేటు. నిందితులను వదిలిపెట్టమని దేశ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి నా గుండె మండుతోంది. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా శాంతి భద్రతల్ని కాపాడడంపై దృష్టి పెట్టాలి. మణిపూర్‌లోని మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ క్షమించం"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Indian Railways: జనరల్ బోగీలకు, స్లీపర్ క్లాస్‌లకు ఆధునిక హంగులు- ప్రక్షాళన దిశగా రైల్వే వ్యవస్థ