Biren Singh: మణిపుర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్ర దాడి - భద్రతా సిబ్బందికి గాయాలు
Manipur CM N Biren Singh: మణిపుర్ సీఎం కాన్వాయ్‌పై సోమవారం ఉదయం తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటన కాంగ్‌పోక్పి జిల్లాలో జరగ్గా.. భద్రతా సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి.
Manipur Chief Minister N Biren Singh Convoy Attacked: జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపుర్‌లో ఏకంగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (Biren Singh) కాన్వాయ్‌పైనే దాడికి యత్నం జరిగింది. సోమవారం ఉదయం సీఎం కాన్వాయ్‌పై సాయుధులైన తీవ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో సీఎం భద్రతా సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల హింస చెలరేగిన జిరిబామ్ జిల్లాకు సీఎం మంగళవారం వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు సెక్యూరిటీ సిబ్బంది వెళ్తుండగా ఆ కాన్వాయ్‌పై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, ఈ దాడిని భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ ఘటన కాంగ్‌పోక్పీ జిల్లాలో జరిగింది.
ఇటీవల జిరిబామ్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 70కిపైగా ఇళ్లను తగులబెట్టడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ క్రమంలో కొందరు పౌరులు వేరే చోటుకి పారిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల టైంలో లైసెన్స్ తుపాకులను పోలీసులు జప్తు చేయడంతో వీటిని తిరిగి ఇవ్వాలని స్థానికులు జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనగా.. సీఎం బీరెన్ సింగ్ అక్కడ సందర్శించాలని అనుకున్నారు. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ సిబ్బంది వెళ్తున్న క్రమంలో మిలిటెంట్లు ఆ కాన్వాయ్‌పై ఆకస్మికంగా దాడి చేశారు.
#WATCH | Manipur: Visuals from a hospital in Imphal where the injured police officials of the advance security team of Manipur Police have been admitted after they were attacked by unidentified armed miscreants
— ANI (@ANI) June 10, 2024
The security team of Manipur Police had gone to Jiribam ahead of… pic.twitter.com/BfULlfRKDz
దాడిని ఖండించిన సీఎం
#WATCH | Violence in Jiribam, Manipur | Imphal: Manipur CM N Biren Singh says, "It is very unfortunate and highly condemnable. It is an attack directly on the Chief Minister, means directly on the people of the state. So, State Government has to do something. So, I will take a… pic.twitter.com/sH5I9qYJhf
— ANI (@ANI) June 10, 2024
కాన్వాయ్‌పై దాడిని సీఎం బీరెన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది నేరుగా ముఖ్యమంత్రిపై అంటే ప్రజలపై దాడిగా అభివర్ణించారు. దాడి ఘటనపై విచారణ జరిపించి కఠిన చర్యలు చేపడతామని అన్నారు.
Also Read: PM Modi: ప్రధాని మోదీ 3.0 ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనూహ్య ఘటన - జంతువు సంచారం, వీడియో వైరల్!