ఆన్‌లైన్‌లో రూ. 90 వేల కెమెరా లెన్స్ ఆర్డర్, బాక్స్ ఓపెన్ చేస్తే మైండ్ బ్లాక్
Amazon Order: ఓ కస్టమర్ ఆన్‌లైన్‌లో కెమెరా లెన్స్ ఆర్డర్ చేస్తే చియా సీడ్స్ ప్యాకెట్ వచ్చింది.
Amazon Order:
లెన్స్‌కి బదులు చియా సీడ్స్ ప్యాకెట్..
ఆన్‌లైన్ ఆర్డర్‌లతో ఎంత వెసులుబాటు ఉంటుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది. మనం ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే మనకు వచ్చేది ఒకటి. చాలా మంది ఇప్పటికే ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ చేసే ఉంటారు. ఓ నెటిజన్‌కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ట్విటర్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఈ మధ్యే రూ.90 వేలు విలువ చేసే కెమెరా లెన్స్‌లు ఆర్డర్ పెట్టాడు. చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూశాడు. ఇంటికి డెలివరీ రాగానే చాలా యాంగ్జిటీతో ఓపెన్ చేశాడు. దెబ్బకు కళ్లు తిరిగిపోయాయి. కెమెరా లెన్స్‌కి బదలు ఆ పార్సిల్‌లో చియా సీడ్స్ ప్యాకెట్ కనిపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...కెమెరా లెన్స్ బ్యాగ్, బాక్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి. అందులో లెన్స్‌కి బదులు చియా సీడ్స్ ప్యాకెట్‌ని పెట్టారు. ఇది చూసిన వెంటనే తీవ్ర అసహనానికి గురైన ఆ కస్టమర్ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
"అమెజాన్‌లో రూ.90వేల విలువైన కెమెరా లెన్స్ ఆర్డర్ చేశాను. నాకు వచ్చింది మాత్రం చియా సీడ్స్ ప్యాకెట్. లెన్స్ బ్యాగ్, బాక్స్‌లో ఈ ప్యాకెట్ పెట్టి పంపించారు. ఇదో పెద్ద స్కామ్. లెన్స్ బాక్స్ ఓపెన్ చేసి ఉంది. వీలైనంత త్వరగా నా సమస్యని సాల్వ్ చేయండి"
- కస్టమర్
Ordered a 90K INR Camera lens from Amazon, they have sent a lens box with a packet of quinoa seeds inside instead of the lens. Big scam by @amazonIN and Appario Retail. The lens box was also opened. Solve it asap. pic.twitter.com/oED7DG18mn
— Arun Kumar Meher (@arunkmeher) July 6, 2023
అమెజాన్ తన కంప్లెయింట్‌ని రిజిస్టర్ చేసుకుందని, త్వరలోనే ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేస్తామని మాటిచ్చిందని చెప్పాడు బాధితుడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటేనే భయమేస్తోందని ఇంకొందరు కామెంట్ చేశారు.
@amazonIN @amazon is saying they are investigating the case, but how come this happened in the first place. This is totally unacceptable, please solve it asap and send me the lens I ordered or refund my money.
— Arun Kumar Meher (@arunkmeher) July 6, 2023
ఈ ట్వీట్స్‌పై అమెజాన్ స్పందించింది. ఇలా జరిగినందుకు సారీ చెప్పింది. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది.
We apologize for the issue with incorrect item. As you have reported this to our support team, our team must have asked you to wait for a certain time frame, we request you to please wait till the mentioned time frame for an update. Appreciate your understanding.1/2
— Amazon Help (@AmazonHelp) July 7, 2023
-Jitheshwara
Also Read: ఫ్రెండ్‌తో పడక పంచుకోవాలని భర్త బలవంతం, బాధితురాలి ఫిర్యాదుతో 9 మంది అరెస్ట్