Mahatma Gandhis Grandson Died: మహాత్మగాంధీ మనవడు అరుణ్ గాంధీ మృతి, నేడే అంత్యక్రియలు
Mahatma Gandhis Grandson Died: జాతిపిత మహాత్మ గాంధీ మనవడు 89 ఏళ్ల అరుణ్ గాంధీ ఈరోజు ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
Mahatma Gandhis Grandson Died: జాతిపిత మహాత్మాగాంధీ మనవడు, 89 ఏళ్ల అరుణ్ గాంధీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మృతి చెందారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొల్హాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. మణిలాల్ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు 1934 ఏప్రిల్ 14వ తేదీన అరుణ్ గాంధీ డర్బన్‌లో జన్మించారు. తన తాత, జాతిపిత మహాత్మ గాంధీ అడుగు జాడలను అనుసరించి రచయితగా, ఉద్యమ కారుడిగా మహారాష్ట్ర ప్రజలకు సేవ చేశారు. అంతేకాందడోయ్ అరుణ్ గాంధీ తన తాతలకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా రాశారు.
Bereaved. Lost my father this morning🙏🏽
— Tushar बेदखल (@TusharG) May 2, 2023
గాంధేయ విలువల ప్రచారకర్తగా..!
అరుణ్ గాంధీకి కుమారుడు తుషార్, కుమార్తె అర్చన, నలుగురు మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు. అరుణ్ గాంధీ తనను తాను శాంతి పూజారి అని చెప్పుకునేవారు. బెథానీ హెగెడస్ మరియు ఇవాన్ టర్క్‌లు చిత్రీకరించిన 'కస్తూర్బా, ది ఫర్గాటెన్ ఉమెన్', 'గ్రాండ్ ఫాదర్ గాంధీ', 'ది గిఫ్ట్ ఆఫ్ యాంగర్: అండ్ అదర్ లెసన్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మహాత్మా గాంధీ' వంటి పుస్తకాలను రాశారు. తన తాత అడుగుజాడలను అనుసరించి, అతను ఎల్లప్పుడూ శాంతి, సామరస్య స్థాపన కోసం గాంధేయ విలువలను ప్రచారం చేశాడు.