Maharashtra Political Crisis: ఏక్‌నాథ్ షిండేపై శివసేన చర్యలు- వెంటనే స్పందించిన రెబల్ ఎమ్మెల్యే
.Maharashtra Political Crisis: శివసేన పార్టీకి రెబల్‌గా మారిన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేను శాసనసభా పక్ష పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభనకు కారణమైన శివసేన ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండేపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఆ పార్టీ. ఏక్‌నాథ్‌ను శాసనసభా పక్షనేత హోదా నుంచి తొలగించింది. శివాడీ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నూతన పార్టీ సభా పక్షనేతగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
నాది మోసం కాదు
"We are Balasaheb's staunch Shiv Sainiks. Balasaheb has taught us Hindutva. We have never and will never cheat for power on Balasaheb's thoughts and Anand Dighe Saheb's teachings", tweets Shiv Sena leader Eknath Shinde
— ANI (@ANI) June 21, 2022
(File Pic) pic.twitter.com/ysQhDhtL3b
తనను శాసనసభా పక్ష నేత పదవి నుంచి తొలిగించిన తర్వాత ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఇందుకు సంబంధించి మరాఠీలో ట్వీట్ చేశారు.
అనంతరం ట్విట్టర్ బయో నుంచి 'శివసేన' అన్న పదాన్ని షిండే తొలగించారు. 10 మందికి పైగా ఎమ్మెల్యేలతో షిండే సూరత్‌లోని ఓ హోటల్లో మకాం వేసినట్లు సమాచారం.
ఈ పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో శివసేన సర్కార్‌ను కూలదోయాలని భాజపా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అయితే అలా జరగడానికి ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాదని భాజపా గుర్తించుకోవాలని హెచ్చరించారు. ఏక్‌నాథ్ షిండేతో పాటు మిగిలిన శివసేన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారన్నారు.
కాంగ్రెస్
మహారాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను మహారాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడిగా నియమించింది.
Also Read: Agnipath Scheme: 'అంత వరకూ వస్తే మోదీ ఎంత రిస్క్ ఉన్నా లెక్క చేయరు- లీడర్ అంటే ఆయనే'