Gas Cylinder Rates Hike: సామాన్యుడికి మళ్లీ షాక్! గ్యాస్ సిలిండర్ ధర పెంపు, కొత్త రేట్లు ఇవీ
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఈరోజు (మార్చి 1) నుంచి మరింత పెంచారు. ఒక సిలిండర్ ధర రూ.50 వరకూ పెరిగింది.
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్య ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఈరోజు (మార్చి 1) నుంచి మరింత పెంచింది. ఒక సిలిండర్ ధర రూ.50 వరకూ పెరిగింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో నేటి నుంచి రూ.1103కి అందుబాటులోకి రానుంది. దీని మునుపటి ధర సిలిండర్‌కు రూ.1053 గా ఉండేది.
19 కిలోల కమర్సియల్ సిలిండర్ ధర కూడా పెంపు
కమర్షియల్ LPG సిలిండర్ ధర కూడా పెరిగింది. దాని ధర రూ. 350.50 పెరిగింది. రూ.350.50 పెరిగిన తర్వాత, రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర సిలిండర్ రూ.2119.50కి చేరింది.
హైదరాబాద్‌లో ధర ఇదీ
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1,105 ఉండగా ఈ పెంపు వల్ల ఇక అది నేటి నుంచి రూ.1,155 అయింది.
Domestic LPG Cylinder 14.2 kg prices increased by Rs 50/. Domestic LPG cylinder price increased to Rs 1103/ in Delhi: sources
— ANI (@ANI) March 1, 2023
నాలుగు మెట్రో నగరాల్లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఇవీ
ఢిల్లీలో దేశీయ ఎల్‌పీజీ ధర రూ.1,053 నుంచి రూ.1,103కి పెరిగింది.
ముంబైలో దేశీయ ఎల్‌పీజీ ధర సిలిండర్‌కు రూ.1,052.50 నుంచి రూ.1102.50కి పెరిగింది.
కోల్‌కతాలో దేశీయ ఎల్‌పీజీ ధర రూ.1,079 నుంచి రూ.1,129కి పెరిగింది.
చెన్నైలో దేశీయ LPG ధర రూ.1,068.50 నుంచి రూ.1,18.50కి పెరిగింది.
నాలుగు మెట్రోలలో కమర్షియల్ LPG సిలిండర్ల కొత్త ధరలు ఇవీ
ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ ధర రూ.1,769 నుంచి రూ.2,119.50కి పెరిగింది.
ముంబయిలో వాణిజ్య LPG ధర సిలిండర్‌కు రూ.1,721 నుంచి రూ.2071.50కి పెరిగింది.
కోల్‌కతాలో వాణిజ్య ఎల్‌పీజీ ధర రూ.1,869 నుంచి రూ.2,219.50కి పెరిగింది.
చెన్నైలో వాణిజ్య LPG ధర రూ.1,917 నుండి రూ.2,267.50కి పెరిగింది.
8 నెలల తర్వాత..
8 నెలల తర్వాత డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరగగా, అంతకుముందు జూలై 1న డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో పెరుగుదల కనిపించింది. దీంతో చివరిసారిగా జూలైలోనే గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, అప్పటి నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగినా ఇళ్లలో ఉపయోగించే వంటగ్యాస్ ధర మాత్రం పెంచలేదు.