(Source: ECI/ABP News/ABP Majha)
Viral Vieo: కదులుతున్న బైక్ పై రొమాన్స్, వీడియో వైరల్- యువతీయువకుడు అరెస్ట్
Obscene Acts On Bike : రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరంలో బైకుపై రొమాన్స్ చేసిన జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Obscene Acts On Bike: రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరంలో బైకుపై రొమాన్స్ చేసిన జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు, ఓ యువతి మోటార్‌సైకిల్‌పై అసభ్యకర పనులు చేస్తూ కనిపించారు. ఈ వీడియోను మోటార్‌సైకిల్‌ను వెనుకే నడుపుతున్న మరో డ్రైవర్ తన కెమెరాలో బంధించాడు. ఇదిలా ఉండగా కోట రిజిస్టర్డ్ బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా నగర పోలీసులు చర్యలు చేపట్టి యువకుడు, యువతి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులైన అబ్బాయి, అమ్మాయిల చేత పోలీసులు క్షమాపణలు చెప్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ వీడియోలో ఇద్దరూ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎవరూ చేయవద్దని చెబుతున్నారు.
బైకు మీద వెళ్తూ అసభ్యకర పనులు, నెటిజన్స్ ఆగ్రహం
బహిరంగ ప్రదేశంలో అసభ్యకర చర్యలకు పాల్పడినందుకు నిందితులైన యువతీయువకులపై సెక్షన్ 294ఎ కింద కేసు నమోదు చేసినట్లు సిటీ పోలీసులు తెలియజేశారు. మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో దాదాపు ఒక నిమిషం 14 సెకన్ల నిడివిని కలిగి ఉంది. ఇందులో యువకుడు రోడ్డుపై అతివేగంతో బైక్ నడుపుతూ కనిపించాడు. యువతి అతని ముందుగా బైక్ ఇంజిన్ మీద అతి ప్రమాదకరంగా కూర్చొని ఉంది. వారిద్దరూ బహిరంగంగా అసభ్యకర పనులు చేస్తూ కనిపించారు. అక్కడ ఉన్న వ్యక్తులు ఈ మొత్తం చర్యను తమ మొబైల్ కెమెరాలలో బంధించారు. కోటా ఆర్‌టీఓ వద్ద ఆ మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. బండి రోడ్ హెర్బల్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. ఆ వ్యక్తిని జిల్లాలోని కైతున్ పట్టణానికి చెందిన మహ్మద్ వాసిమ్ (25)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
सड़क पर बेशर्म जोड़े का बेशर्मी की सारी करने वाला वायरल वीडियो !!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 23, 2024
हमारी युवा पीढी कोटा की सङको पर खूले आसमान के नीचे !!
कोटा पुलिस एक बार फट्टा फ्राई कर दे तो हजारो लबेरीयो को सीख मिल जायेगी !! #viralvideo #kota #Rajasthan @RajsamandPolice @BhajanlalBjp pic.twitter.com/NzQdbRw5Co
వారిపై పోలీసుల చర్యలు
ఈ వీడియో బుధవారం రాత్రి పోలీసుల దృష్టికి వచ్చిందని నాంటా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నావల్ కిషోర్ శర్మ తెలిపారు. దీని తరువాత, గురువారం ఉదయం చర్యలు తీసుకుంటూ, నిందితులైన అబ్బాయి అమ్మాయిలపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అబ్బాయి, అమ్మాయిల చేత క్షమాపణలు చెప్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ వీడియోలో ఇద్దరూ భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయవద్దని చెబుతున్నారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది వారి బాధ్యతారాహిత్యమైన, అశ్లీల ప్రవర్తనకు విమర్శిస్తున్నారు.