By: Ram Manohar | Updated at : 30 Jun 2023 05:28 PM (IST)
పాలనా వ్యవహారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ని సవాలు చేస్తూ ఆప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
Kejriwal Vs Centre:
మళ్లీ ఆప్ పిటిషన్..
ఆప్, కేంద్రం మధ్య విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. ఢిల్లీ పరిపాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం పెరుగుతోందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆప్. ఆ పార్టీకి అనుకూలంగానే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అధికారుల తొలగింపు, బదిలీల విషయాల్లో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పింది. అయినా కూడా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. అధికార బదిలీపై అధికారం తమకే ఉండేలా ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు చెప్పినా కేంద్రం పట్టించుకోడం లేదని మండి పడింది. కొద్ది రోజులుగా దీనిపై రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం నడుస్తోంది. అయితే...ఆప్ మళ్లీ న్యాయపోరాటానికి దిగింది. కేంద్రం తీసుకొచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తోంది. ఆ ఆర్డినెన్స్‌ని వెంటనే నిషేధించాలని సుప్రీంకోర్టుని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం...కేంద్ర ప్రభుత్వం National Capital Public Service Authority ని ఏర్పాటు చేయనుంది. గ్రూప్-A అధికారుల బదిలీకి ఇది వీలు కల్పిస్తుంది. అంతే కాదు. ఎవరైనా తప్పు చేస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోడానికీ అవకాశముంటుంది. దీనిపైనే కేజ్రీవాల్ సర్కార్ పోరాటం చేస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వారికే పదవులు అప్పగించేలా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు..
ఢిల్లీ పాలనా వ్యవహారాలపై ఇటీవలే సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రభుత్వ అధికారాలకు లోబడి పని చేయాలని తేల్చి చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పుని ధర్మాసనం తోసి పుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉండాలని వెల్లడించింది. శాసన, కార్యనిర్వాహక అధికారాలు ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది. అయితే..పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ వ్యవహారాల్లో మాత్రం ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలన్న నిబంధన వర్తించదని తెలిపింది. మిగతా అన్ని వ్యవహారాల్లోనూ ఢిల్లీ ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అయితే...2019లో కింది కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని వ్యవహారాలపై అధికారాలు ఉండవని తేల్చి చెప్పింది. ఈ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. Article 239AA ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. అయితే...ఈ ఆర్టికల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం వర్తించదని వివరించింది. National Capital Territory of Delhi (NCTD)కి సంబంధించి అధికారాలను ఎన్నికైన ప్రభుత్వానికే బదిలీ చేయాలని తెలిపింది.
రివ్యూ కోరిన కేంద్రం..
తీర్పుని రివ్యూ చేయాలంటూ కేంద్రం..సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. National Capital Civil Service Authority ఏర్పాటు చేయనుంది. అయితే...ఢిల్లీలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై ఈ అథారిటీకి అధికారం ఉంటుంది. గ్రూప్ A ఆఫీసర్లను బదిలీ చేసేందుకు వీలవుతుంది. అయితే..సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం...అధికారుల బదిలీ ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. అందుకే..దీనిపై రివ్యూ కోరింది కేంద్ర ప్రభుత్వం.
Also Read: Manipur Violence: రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన మణిపూర్ సీఎం బైరెన్ సింగ్, అలాంటి ఆలోచన లేదని ట్వీట్
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
/body>